Site icon NTV Telugu

CM Revanth Reddy: రెండో సారి మూడో సారి సీఎం కావాలని నాకు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: శిల్పకళా వేదికలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ముఖ్యమంత్రులు ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారు. కానీ తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యంత వివాదాస్పద శాఖ విద్యా శాఖ.. అది తనకు వద్దని పలువురు చెప్పారు… కానీ వివాదాస్పదం సంగతి చూద్దామనే తన దగ్గర పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన శాఖ అని.. అందుకే దానిని తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది అవగాహన రాహిత్యంతో ఈ శాఖకు మంత్రిని పెట్టమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విమర్శలకు ఒకటే మాట చెప్తున్నా… ఈ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే దీనిని తన దగ్గర పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

READ ALSO: Guntur District : వినాయక నిమజ్జనం సమయంలో టీడీపీ కార్యకర్త ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

తెలంగాణకు ఎడ్యుకేషన్ పాలసి కావాలి..
ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ పడాలని సీఎం అన్నారు. తెలంగాణకు ఎడ్యుకేషన్ పాలసి కావాలని స్పష్టం చేశారు. ఆ పాలసీ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మూడో సారి సీఎం కావడానికి కారణం విద్యా రంగంలో ఆయన తెచ్చిన మార్పులే అని గుర్తు చేశారు. తాను కూడా అలా కావాలని అనుకుంటున్నట్లు సీఎం చెప్పారు. తనకు కూడా రెండో సారి, మూడో సారి సీఎం కావాలని ఉంటుంది అన్నారు. తాను ఫార్మ్ హౌస్‌లో పడుకుని మిమ్మల్ని పని చేయమని చెప్పానని, డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఉపయోగం ఏంటని, BMW, బెంజ్ కార్ల కాలంలో అని సీఎం ప్రశ్నించారు. అంబాసడర్ కారు కావాలంటే ఫార్మ్ హౌస్‌కు వెళ్ళాలని అన్నారు. విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్నారు. డ్రగ్స్ మహమ్మారి తాలూకా స్థాయికి చేరిందని అన్నారు. దీనిని అరికట్టడానికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అందరం కలసి అద్భుతమైన తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

కేజీ 2 పీజీ ఉచిత నిర్భంద విద్య అందిందా..
కేజీ టు పీజీ అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి మీరు సంపూర్ణ మద్దతు అందించారు. కేజీ 2 పీజీ ఉచిత నిర్భంద విద్య అందిందా అని సీఎం ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాల్లో స్కూల్స్ మూత పడ్డాయో లేదో ఆలోచించాలని అన్నారు. తెలంగాణ నినాదాన్ని, ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లింది టీచర్‌లని గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీచర్‌లు గత పదేళ్లలో ఎన్ని సమస్యలను పరిష్కరించుకున్నారని సీఎం ప్రశ్నించారు. గత పాలకులకు ఉపాధ్యాయుల సమస్యలను ప్రరిష్కరించాలనే ఆలోచన రాలేదు… తమ ప్రభుత్వం వచ్చాకే వారి సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. brs ప్రజా ప్రతినిధుల ప్రైవేట్ వర్సిటీలు పెట్టుకొని వ్యాపారం చేశారని, ప్రభుత్వ వర్సిటీల్లో గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ఓయూ మూత పడే పరిస్థితికి వచ్చిందని అన్నారు.

గురుపూజోత్సవం గత ప్రభుత్వంలో జరిగిందా…
గత ప్రభుత్వంలో గురుపూజోత్సవం జరిగిందా.. ఆ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ లాంటి టీచర్‌లు చెప్పిన చదువు నేర్చుకునే ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను చిన్నచూపు చూసే ఆలోచన ప్రజాప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఉన్న, తక్కువగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, దీనికి కారణం అయితే తాను కావాలి లేదంటే ఉపాధ్యాయులు అయ్యి ఉండాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్‌లో కన్నా ప్రభుత్వ స్కూల్ టీచర్‌లు అధికంగా చదువుకున్నవారు.. ఇకపై సర్కార్ స్కూల్స్‌లో పిల్లల నమోదు సంఖ్య పెరగాలని అన్నారు. స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అందుకే ప్రతి ఏడాది రూ.130 కోట్ల సీఎస్ఆర్ నిధులు పాఠశాలలో క్లీనింగ్‌కు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురవడం తనకు బాధ కలిగిందని సీఎం అన్నారు. ఇకపై ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని.. అప్పుడప్పుడు తాను కూడా వచ్చి మీతో, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని సీఎం అన్నారు.

READ ALSO: Khairathabad : ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక పూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Exit mobile version