NTV Telugu Site icon

CM Revanth Reddy : తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై చర్చ జరగలేదు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

రెండు మూడు రోజులుగా తెలంగాణలో , కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు.. వివిధ అంశాలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల దృష్ట్యా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చారని, కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురి అయ్యారని, మా వైపున , పీసీసీ నుంచి సమన్వయం చేయడంలో గందర గోళం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం జీవన్ రెడ్డి తో చర్చించిందని, జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తారని, కొందరు నక్కలు, ఏదయినా జరిగితే బాగుండు అని చూస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి గుంట నక్కలకు అవకాశం ఇవ్వలేదన్నారు. జీవన్ రెడ్డి పార్టీ పట్ల కమిట్మెంట్ తో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో విద్యాశాఖ చేసిన పనులు.. ఇపుడు మేం చేసిన పనులు చూడండన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా.. ‘రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం. కేంద్రంలో మంత్రులను కలుస్తున్నామ్.. బేషజాలకు పోకుండా మా ప్రయత్నం చేస్తున్నాం.. గ్యారెంటీలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.. పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించటం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య.. కేసీఆర్ కు సిగ్గుండాలి.. ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా.. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాయాలి.. ప్రభుత్వం పడిపోతుంది అని అంటే ఊరుకోవాలా.. కేసీఆర్ కి సిగ్గు ఉండాలి.. మాట తప్పిండు కేసీఆర్.. కేసీఆర్ చేసిన తప్పులకు ముక్కు నేలకు రాయాలి.. 100 రోజులు కూడా మా ప్రభుత్వం ఉండదు అన్నది ఎవరు కేసీఆర్ కదా.. కేసీఆర్.. బీజేపీ ఇద్దరు అదే మాటలు అన్నాడు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని భావాదారిద్యం లో ఉన్నాడు కేసీఆర్.. సిరిసిల్లలో.. బీజేపీ ఫిస్ట్ ప్లేస్ వస్తుందా.. సిద్దిపేటలో సమాన ఓట్లు వస్తాయా.. మెదక్ లో మూడో ప్లేస్ ఎట్లా వచ్చింది.. మోడీ కాళ్ళు పట్టుకుంటాం అనేది కేసీఆర్‌ ఆలోచన.. కాళ్ళ జోర్రుత అని కేసీఆర్ ఉన్నాడు. అసెంబ్లీ కి రమ్మంటే రాడు..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.