Site icon NTV Telugu

CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌ సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ అరెస్ట్ ఊహాగానాలకు తెరదించారు. కేసీఆర్‌ స్వీయ నియంత్రణలో బందీ అయ్యారని.. కొత్తగా ఆయన్ని జైల్లో పెట్టాల్సి అవసరం లేదన్నారు సీఎం రేవంత్. చర్లపల్లి జైలుకు ఫామ్‌హౌస్‌కు పెద్ద తేడా లేదన్నారు. ఫామ్‌హౌస్‌లో పర్యవేక్షణ ఉంటుంది. జైల్లో పహారా ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌ను ప్రజలు ఓడించడమే పెద్ద శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు.

READ MORE: Harassment: అసలు వీడు మనిషేనా.. యువతి ముందు ప్యాంట్ జిప్ తీసి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించి రాష్ట్రపతికి పంపామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ రిజర్వేషన్లపై పోరాడేందుకే ఢిల్లీకి వచ్చామని స్పష్టం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద మహా ధర్నా నిర్వహించి కేంద్రాన్ని నిలదీశామన్నారు. గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని దేశ రాజధానికి వచ్చినట్లు చెప్పారు. ఈ ధర్నాకు 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని.. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ రాకుండా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా అడ్డుకున్నారన్నారు. ఆ అపాయింట్‌మెంట్‌ కోసం మంత్రివర్గం మొత్తం ఎదురు చూస్తోందని తెలిపారు. రాష్ట్రపతిని కలిసే అవకాశం తమకు ఇవ్వకపోవడం శోచనీయమని.. ముస్లిం రిజర్వేషన్ల సాకుతో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆ పార్టీ భావిస్తే అలాగే చట్టం చేయాలని సూచించారు.

READ MORE: Lara Williams: హైదరాబాద్‌లో యుఎస్ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన లారా విలియమ్స్..

 

Exit mobile version