NTV Telugu Site icon

CM KCR Public Meeting Live Updates: మునుగోడులో కేసీఆర్ బహిరంగ సభ లైవ్ అప్ డేట్స్

cm kcr sabha 1

Maxresdefault

🔴 CM KCR Munugode Public Meeting LIVE : TRS Public Meeting at Munugode | NTV Live

కాసేపట్లో చండూరులో కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది.

The liveblog has ended.
  • 30 Oct 2022 04:47 PM (IST)

    మంచి మెజారిటీ మనకు ఖాయం-కేసీఆర్

    మునుగోడు వారికి చెంపపెట్టు కావాలి. వామపక్ష, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని నిషేధించారు. ఎవరినైనా కొట్టారా? ఆయన ప్రచారాన్ని ఎందుకు ఆపారు? మూడవ తేదీన మీ సత్తా చాటండి. శాంతియుతంగా, హింసకు పోకుండా వారికి బుద్ధి చెప్పాలి. వడ్లు కొనమంటే నూకలు తినమన్నారు...అలాంటివారి తోకలు కట్ చేయాలి. ఇంటికి తులం బంగారం అంటారు. మూడో తేదీ తర్వాత ఎవరైనా కనబడతారా? గెలిచాక ఎవరూ కనిపించరు. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్. గోల్ మాల్ కావద్దు. మనకు చైతన్యం వుంటే వాళ్ల ఆటలు సాగవు.

  • 30 Oct 2022 04:43 PM (IST)

    అలాంటి వారిని తన్ని తరిమేయాలి.. కేసీఆర్

    చేనేతల బడ్జెట్ భారీగా పెంచాం. చేనేత బీమా తెచ్చాం.. రైతు బీమా లేదు. దేశంలో లేనిది మనం తెచ్చుకున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. కేసీఆర్ వున్నంతకాలం దానిని ఎవరూ ఆపలేరు. ఉచితాలు ఆపాలట.. కార్పోరేట్ గద్దలకు 14లక్షల కోట్లు మాఫీ చేశాడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే లక్ష 40 వేల కోట్లు అవుతుంది. మోడీగారు మీ సమాధానం ఏంటి? ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలను కొందామని వచ్చి, జైలులో వున్నారు. తడిబట్టలతో ప్రమాణం చేయాలా? కేసు కోర్టులో వుంది. నేను మాట్లాడకూడదు. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలిపేయాలి. పెట్టుబడిదారుల తొత్తుల్ని తన్ని తరిమేయాలి. సాగనంపాలి. లేకుంటే దేశం బాగుపడదు.

  • 30 Oct 2022 04:40 PM (IST)

    విశ్వ గురువా...విష గురువా ?

    బిజెపికి తెలంగాణలో బుద్ధి చెప్పాలి . ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? డాలరుతో రూపాయి విలువ 82 రూపాయలా. అర్థం అయిన తర్వాత కూడా బుద్ధి చెప్పాలి. మీ ఓటే మీ ఆయుధం. నాటకాలు నడవవు. లక్షల కోట్లు పేదలకు చెందినది పెద్దలకు ఇస్తారా? ప్రభుత్వరంగంలోని కంపెనీలను కాపాడదామా? వడ్డు కొనుడు చేతకాదు.. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటారా? బీజేపీకి బుద్ధి చెప్పాలి... ఓటు ద్వారా మనం తిరుగుబాటు చేయాలి. మీ ఆటలు సాగవని మనం సందేశం ఇవ్వాలి. వామపక్షాలు, మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంటింటికి వచ్చి చెబుతున్నాం. అన్యాయం జరిగింది.. పెట్రోల్ ధర పెరిగింది.. జీఎస్టీమీద పోరాడాలి. కత్తి ఒకని చేతిలో పెట్టి వేరే వాడిని యుద్ధం చేయమంటే ఎలా?

  • 30 Oct 2022 04:36 PM (IST)

    చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్

    బీఆర్ ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి.

  • 30 Oct 2022 04:31 PM (IST)

    భయంకర కుట్ర జరుగుతోంది-కేసీఆర్

    దేశంలో భయంకర కుట్ర జరుగుతోంది. దేశంలో కుట్రను మనం భగ్నం చేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. నష్టపోయేది, కష్టపడేది మనమే. మీటర్లు పెట్టకుండా చూడాలి. మునుగోడు నీళ్ళ గోస తీరిందా? ఫ్లోరైడ్ సమస్య తీర్చాలని వాజ్ పేయిని కలిశారు. సమస్య తీర్చలేదు. మునుగోడులో అనేక మండలాలు తిరిగా. మనలో చైతన్యం కోసం పాట రాశా.. చూడు చూడు నల్లగొండ.. నల్లగొండకు నరకం చూపిన జెండాలు ఎన్నో. అలాంటి జెండాలు గుర్తుపట్టాలి. హంసలా పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు వేరుచేయాలి. ప్రజల్లో అమాయకత్వం వుంటుందో దుర్మార్గుల ఆటలు సాగుతాయి. ఒళ్ళు మరిచి ఓటు వేసి ఇళ్ళు కాల్చుకోవద్దు. దేశం వంచించబడుతోంది. కేంద్రం విధానం వల్ల నీళ్లు రావు, కరెంట్ రాదు.

  • 30 Oct 2022 04:26 PM (IST)

    మీటర్లు పెట్టి కొంపలు ఆర్పుకుందామా?-కేసీఆర్

    దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం మోసం చేస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటారు. మీటరు ధర వారే నిర్ణయిస్తారు. మోడీ బయటపెట్టిన సర్క్యులర్ వచ్చింది. మీటర్లు కావాలా? మోసపోతే నష్టపోతాం. ఎన్నికలలో వారిని నమ్మితే మోసాలకు గురి అవుతాం. మీకు దండం పెడుతున్నా. మనం ధర్మం వైపు నిలబడాలి. ప్రైవేటీకరణకు మొగ్గు చూపితే నష్టం మనకే. మీ బలం చూసి కొట్లాడుతాం. మీరే మా బలం. మీరు సహకరించకపోతే ఏం చేయగలం. మునుగోడులో మీరు వారికి ఓటేస్తే.. నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్ ని పడగొట్టి తెలంగాణను కబ్జా పెడతామని రంగంలోకి వచ్చారు. ఈ దేశంలో కరెంట్ వున్నా ప్రజలకు రాదు.

  • 30 Oct 2022 04:21 PM (IST)

    మాయలో పడితే మంచి జరగదు-కేసీఆర్

    మనం పండ్లు తినాలంటే.. పండ్ల చెట్లు పెట్టాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. గాడిదలు గడ్డి వేస్తే.. ఆవుల నుంచి పాలు రావు. గడ్డి వేసేటప్పుడే ఆలోచించాలి. యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని చేయని దుర్మార్గం. చేనేతలపై భారం వేశారు. ఏ విధంగా బీజేపీకి ఓటువేయాలి. ఆషామాషీగా తీసుకోకూడదు. అన్నంలో సగం లాక్కుంటా.. నాకే ఓటు వేయి అంటే ఓటు వేస్తా. మన వేలితో మన కన్ను పొడుచుకుందామా? పోరాటం అంటే ప్రదర్శనలు చేస్తాం. భవిష్యత్తులో కూడా వామపక్షాలతో కలిసి నడుస్తాం. నీ వేలితో నీ కన్ను పొడుస్తా అంటే బీజేపీకి ఓటు వేస్తారా? అంతా గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలి. జీఎస్టీ వాపసు తీసుకోవాలంటే.. చేనేతలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయవద్దు.

  • 30 Oct 2022 04:17 PM (IST)

    ఇలాంటి వాళ్ళు కావాలి.. కేసీఆర్

    జంనం చైతన్యం కావాలి. దోపిడీ దారులు మాయమాటలు చెబుతారు. వారి మాటలు నమ్మవద్దు. నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్ గాళ్ళు వంద కోట్లు ఇస్తామంటే ఎడమకాలి చెప్పుతో కొట్టారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు... ఇలాంటి వాళ్ళు కావాలి. 100 కోట్లు ఇస్తామంటే వద్దన్నారు. గడ్డిపోచలా వాటిని పడేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారు. అక్రమ ధనం తెచ్చి.. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. మోడీకి రెండుసార్లు పీఎం అవకాశం వచ్చింది. ఎందుకీ అరాచకం.. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దుర్మార్గమయిన పనిచేసి ఆర్ఎస్ఎస్ నేతలు చంచల్ గూడ జైలులో వున్నారు. ప్రతి విద్యార్థి తీవ్రంగా ఈ అంశం తీసుకోవాలి.

  • 30 Oct 2022 04:13 PM (IST)

    ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి-కేసీఆర్

    ఎవరు చెప్పిన మాటలైనా విని ఇంటికెళ్లి ఆలోచించండి. ఓటు శక్తివంతమయిన ఆయుధం. అలవోకగా, ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు కాలిపోతాది. సమాజానికి అవసరం ఏది అని ఆలోచించాలి. మన బతుకులు బాగుపడతాయి. నల్లగొండ బాగుపడుతుంది. తమాషాగా ఓటేయవద్దు. మర్యాద చేశారని, బావమరిది చెప్పారని ఓటు వేయవద్దు. కరిచే పాము అని తెలిసి ఓటేస్తామా? గ్రామంలో పెద్దలు ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి.

  • 30 Oct 2022 04:10 PM (IST)

    ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు-సీఎం కేసీఆర్

    మునుగోడులో అవసరం లేకుండా ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. గత 20 రోజులుగా ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయం ఏందో... ధర్మం ఏంటో మీకు తెలుసు. నాలుగు విషయాలు మీకు చెబుతాను. ఎన్నికలు వస్తాయి.. అనేక రకాలుగా వస్తాయి. ఎన్నిక రాగానే గాయి.. గాయి గత్తర్... గత్తర్ లొల్లి.. లొల్లి.. కొందరు గాల్లోనే నడుస్తుంటారు. విచిత్ర వేషధారులు వస్తారన్నారు కేసీఆర్.

  • 30 Oct 2022 04:06 PM (IST)

    నన్ను ఆశీర్వదించండి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

    మునుగోడు ప్రజానీకం నన్ను గెలిపించాలి. మీ సేవకుడిగా మీకు అందుబాటులో వుంటా.. అభివృద్ధికి పాటుపడతా.. నేను మట్టిబిడ్డను. గులాబీ జెండా ఎగరేసి నన్ను ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటేయండి అన్నారు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

  • 30 Oct 2022 04:02 PM (IST)

    మునుగోడులో కేసీఆర్ బహిరంగసభ

  • 30 Oct 2022 03:51 PM (IST)

    ఇప్పుడు ఎన్నికలు ఎందుకొచ్చాయి?

    మునుగోడులో ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఏడాది తర్వాత ఎన్నికలు రావాలి. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఏం చెబుతున్నాడు.. నియోజకవర్గ అభివృద్ధికి రాజీనామా చేశానని చెబుతున్నారు. వాస్తవం ఏంటి? తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికి అన్నాడట వెనకటికి ఎవడో.. తాడిచెట్టు ఎక్కితే దూడ గడ్డి దొరుకుతుందా? అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం.

    రాజగోపాల్ రెడ్డివి కుంటిసాకులు.. ఉప ఎన్నికలు వస్తే బీజేపీ పోటీకి వస్తుందని రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపారు. 22 వేల కోట్లు కాదు.. 18వేల కోట్లు కాంట్రాక్ట్ కోసం బీజేపీకి అమ్ముడుపోయానని చెప్పినట్టే కాదు. బీజేపీలో నేను ఇప్పుడు చేరానని అనుకుంటున్నారు.. కానీ నేను 3 సంవత్పరాల ముందునుంచే బీజేపీతో టచ్ లో వున్నానన్నారు. ఉన్న మొగుడికి విడాకులు ఇవ్వకుండానే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెబుతున్నారు. నమ్మకద్రోహుల్ని ఓడించాలన్నారు వీరభద్రం.

  • 30 Oct 2022 03:34 PM (IST)

    ఆత్మగౌరవం లేని నేత రాజగోపాల్ రెడ్డి

    మునుగోడు అడ్డా,,, కమ్యూనిస్టుల గడ్డ అన్నారు కూనంనేని. టిఆర్ఎస్ ,కమ్యూనిస్టుల కలిసిన తరవాత మనకు ఎదురు లేదు. నల్గొండ జిల్లా ...ఎర్రజెండా. రాజగోపాల్ రెడ్డి లాగా పార్టీలు వదిలి పారిపోలేదు.. రాజగోపాల్ రెడ్డి , కోమటిరెడ్డి బ్రదర్స్ ధర్మం గురించి మాట్లాడితే  ధర్మమే సిగ్గుతో తలదించుకుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి స్టార్ క్యాంపెయినర్.కమ్యూనిష్టులు అమ్ముడు పోయారు అని అంటావా ?. యాదాద్రిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తారా? ఆ నారసింహుడికి కోపం వస్తే మీ పేగులు తీసి మెడలో వేసుకుంటారు. దేశాన్ని కాపాడమంటే.. ఒక్కో రాష్ట్రాన్ని మింగేస్తారా?  మోడీ తర్వాత నెంబర్ 1, నెంబర్ 2లు జైలుకెళ్లే పరిస్థితి రాబోతోంది. 8 రాష్ట్రాలు మింగేసి తెలంగాణ మీద పడ్డారు. తెలంగాణలో మీ ఆటలు సాగనివ్వం. మీకు ఆకలి తీరాలంటే ఎన్ని రాష్ట్రాలను మింగేస్తారు. మునుగోడు నుంచి బీజేపీకి సంకేతం ఇవ్వాలి.

  • 30 Oct 2022 03:31 PM (IST)

    ఇది నల్లగొండ కాదు.. ఎర్రగొండ-కూనంనేని

    కూనంనేని సాంబశివరావు 

    చండూరు సభలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. వేలాదిమంది రక్తతర్పణంతో ఎరుపెక్కిన కొండ.. ఎర్రగొండ... రావి నారాయణ రెడ్డి నెహ్రౌగారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన గడ్డ నల్లగొండ జిల్లా. ఎంతోమంది ధర్మమూర్తుల అడుగులతో పవిత్రమయిన గడ్డ ఇది. ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ. మునుగోడులో ఎవరికి ఓటేయాలో ఆలోచించుకోవాలి. రాజగోపాల్ రెడ్డిలా పార్టీలు మారిన వారు లేరు. పోరాట చరిత్రకు ప్రతీక అయిన కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించాలి. మనల్ని మోసగాళ్ళు అంటారా?

  • 30 Oct 2022 03:18 PM (IST)

    కాసేపట్లో చండూరుకు సీఎం కేసీఆర్

    నల్లగొండ: మరికాసేపట్లో మునుగోడు చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ.. వేదికపై సీపీఐ కూనంనేని సాంబశివరావు ,సిపిఎం తమ్మినేని వీరభద్రం.. మరికాసేట్లో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో చండూరుకు కేసీఅర్

  • 30 Oct 2022 03:07 PM (IST)

    బీజేపీయే టార్గెట్.. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? 

    మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా అక్కడే మోహరించారు. సీఎం కేసీఆర్ మునుగోడు సభలో మాట్లాడనున్నారు. బీజేపీయే టార్గెట్.. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొయినా బాద్ ఫాం హౌస్ సాక్షిగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది బీజేపీ. అయితే, ఈ వ్యవహారానికి తమకు సంబంధం లేదంటోంది బీజేపీ. ఉప ఎన్నిక వేళ ఇదే టీఆర్ఎస్ కు అస్త్రం కానుంది. టీఆర్ఎస్ విజయం దాదాపు ఖాయం అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.