NTV Telugu Site icon

CM Jaganmohan Reddy Tour: ఈనెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లా టూర్

Cm Jagan At Summit

Cm Jagan At Summit

ఏప్రిల్ 26వ తేదీన ఖరారైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయకండి అని జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 26వ తేదీన సింగనమల నియోజక వర్గం లోని నార్పల మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో పాటు పోలీసు అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ కు సూచించారు.

హెలిపాడ్ నుండి సభాస్థలి వరకు బ్యారికేడింగ్ చేయాలని ఆర్అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి ని ఆదేశించారు.హెలిపాడ్ వద్ద విఐపి లు వేచి ఉండే ప్రాంతంతో పాటు కాన్వాయ్ వాహనాలలో కూడా త్రాగునీరు, స్నాక్స్ ఏర్పాటు చేసుకోవాలని హెలిపాడ్ ఇంచార్జ్ కళ్యాణ్ దుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. హెలికాప్టర్ సిబ్బందికి ఆతిథ్య ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని పుట్టపర్తి లోని అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు.హెలిపాడ్ నుంచి సభాస్థలి వద్దకు ముఖ్యమంత్రి వచ్చే మార్గంలో తగినంత సిబ్బందితో శానిటేషన్ చేపట్టాలని డిపిఓ ప్రభాకర్ రావుకు సూచించారు.పార్కింగ్ ప్రదేశాలు, సభాస్థలి వద్ద తగినన్ని టాయిలెట్లు, డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలన్నారు.సమావేశానికి విచ్చేసే కళాశాల, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, లబ్ధిదారులు, తదితరులకు తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డిటిసిలకు సూచించారు.

Read Also: Shivathmika Rajashekar: అలాంటి పాత్రల కోసమే ఇలా చేస్తున్నావా పాపా..

వివిధ సంక్షేమ శాఖల అధికారులు,డీ ఆర్ డీ ఏ,మెప్మా పీడీ లు విద్యార్థులను, లబ్ధిదారులను,సంబంధిత అధ్యాపకులతో సహా వారికి ఏర్పాటు చేసిన బస్సులలో సమావేశానికి తీసుకొనిరావాలని తెలిపారు. ప్రజలు మరియు విఐపి లకు పార్కింగ్ విడివిడిగా ఏర్పాటు చేస్తూ పార్కింగ్ ప్లేస్ వద్ద వాహనాలను సక్రమంగా ఉంచాలని పంచాయతీరాజ్ ఎస్ ఈ కి కలెక్టర్ సూచించారు. సభాస్థలివద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీ లో తగినంత తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ తదితర ఏర్పాట్లు అన్నిటిని పక్కాగా చేపట్టాలని, అలాగే అందుకు తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని గ్యాలరీ ఓవరాల్ ఇన్చార్జి జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి కి కలెక్టర్ సూచించారు. అందరికీ తగినంత త్రాగునీరు అందేలా తాగునీటి వసతి కల్పించాలని ప్రతిచోట సిబ్బందిని కేటాయించి సక్రమంగా నీటిని అందించేలా ఏర్పాటు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సూచించారు.

సభాస్థలి వద్ద నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని, అలాగే విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ లను కూడా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో విద్యుత్ తీగలు వేలాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు .చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, డిఇఓ సాయిరాంలకు కలెక్టర్ సూచించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ఈడీ లను పకడ్బందీ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యే ప్రజలకు, విద్యార్థులకు స్నాక్స్, మజ్జిగ ప్యాకెట్లు మరియు ఆహారాన్ని పకడ్బందీగా అందించాలని హౌసింగ్ పిడి కేశవనాయుడు, డిఎస్ఓ శోభారాణికి కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో నియమ నిబంధన మేరకు అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అందుకు తగిన స్పెషలిస్ట్ డాక్టర్లను సిద్ధంగా ఉంచాలని, 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని, డిఎంహెచ్వో, డి సి హెచ్ ఎస్ లకు సూచించారు.

ముఖ్యమంత్రికి అందజేసేందుకు విచ్చేసే పిటిషనర్ల నుండి తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వారి నుండి ముందస్తుగానే పిటిషన్లను స్వీకరించాలి. ఆ పిటీషన్లన్నింటిని వారి నుండి తీసుకొని డిఆర్ఓ కు అందచేయాల్సిందిగా గుంతకల్ ఆర్డీవో రవీంద్ర కు సూచించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా వారికి అప్పజెప్పిన విధులనుఏలాంటి లోటుపాటులకు తావివ్వకుండా, సక్రమంగా నిర్వహించేలా అధికారులందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, అధికారులకు కేటాయించిన విధులతోపాటు ఉన్నతాధికారులు సూచనలను పరిగణనలోకి తీసుకుని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Tarun Chugh: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

Show comments