NTV Telugu Site icon

CM JAGAN: నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Cm Jagan

Cm Jagan

వరుసగా ఐదో సంవత్సరం రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ ఆర్ధిక సహాయం ఇవాళ అందించనున్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి 4,000 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. 2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వర్చువల్ గా రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు.

Read Also: Mangalyaan-2: మంగళయాన్-2కు సన్నాహాలు.. అంగారకుడి రహాస్యాలను తేల్చనున్న ఇస్రో

ఈ నాలుగున్నర ఏళ్లలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద అందించిన మొత్తం సాయం రూ.33,209.81 కోట్ల రూపాయలుగా ఉంది. ఏటా 3 విడతల్లో రైతులకు రూ. 13,500 ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఏటా 13,500 చొప్పున 5 ఏళ్ళల్లో ఈ పథకం కింద ఒక్కో రైతుకు 67,500 రూపాయల లబ్ది పొందుతున్నారు. ఇక, ఖరీఫ్‌ పంట వేసే ముందు మేలో 7,500 రూపాయలు, అక్టోబర్‌–­నవంబర్‌ నెల ముగిసే లోపే ఖరీఫ్‌ కోతలకు, రబీ అవసరాల కోసం ప్రభుత్వం 4,000 రూపాయలు అందిస్తుంది. పంట ఇంటికి వచ్చే వేళ జనవరి/ఫిబ్రవరిలో 2 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

పుట్టపర్తి లో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఉదయం 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10: 15 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:40 గంటలకు వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి సీఎం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:15కి రైతులకు వైయస్సార్ భరోసా- పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.