ఏపీ నుంచి బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఘనంగా వీడ్కోలు పలికింది రాష్ట్ర ప్రభుత్వం. ఎ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించింది,. అక్కడికి చేరుకున్న సీఎం జగన్ కు స్వాగతం పలికారు మంత్రులు జోగి రమేష్, కారుమూరి, అధికారులు…వేదిక ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి స్వాగతం పలికారు ముఖ్యమంత్రి జగన్.. రాజ్యాంగవ్యవస్థలు, ప్రభుత్వాలు ఎలా ఉండాలో గవర్నర్ చూపించారని కొనియాడారు.బిశ్వభూషణ్ హరిచందన్ కు నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆత్మీయుడైన పెద్ద మనిషిగా, గవర్నర్ వ్యవస్థ కు ఒక ఉదాహరణ ఉన్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఉన్న పరిస్థితి గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం.దానికి భిన్నంగా విశ్వభూషణ్ ఒక తండ్రిలా వ్యవహరించారు.వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక సందర్భంలో 99 వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అన్నింటి కంటే ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు. బిళ్వభూషణ్ హరిచందన్ కు అన్ని వేళలా బాసటగా నిలబడ్డారు సుప్రజా హరిచందన్ . సుప్రజా హరిచందన్ కు రాష్ట్ర ప్రభుత్వం, నా తరపున, నా కుటుంబం తరపున ధన్యవాదాలు అన్నారు సీఎం జగన్. అనంతరం బిశ్వభూషణ్ హరిచందన్ ను సత్కరించిన ముఖ్యమంత్రి జగన్ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.
Read Also: MLA MahipalReddy : అర్థంపర్థంలేని ఆరోపణలు కాదు.. ప్రూఫ్లున్నాయా
ఈసందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. ఏపీ గవర్నర్ గా తన అనుభవాలను పంచుకున్నారు. మీ అందరికి నా అభినందనలు..ఈ రాష్ట్రంలో నేను మూడు సంవత్సరాల ఏడు నెలలు ఉన్నాను.. ఈ రాష్ట్రం నాకు ఎంతో ఆత్మీయత ఇచ్చింది.రాష్ట్రాన్ని వదిలి వెళుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నా పై చూపించిన ప్రేమ, అభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను. రాష్ట్ర ప్రజలు సంక్షేమం గురించి మా మధ్య చాలా సార్లు చర్చ జరిగింది. అన్ని సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలరని నేను ప్రారంభంలో అడిగాను. ముఖ్యమంత్రి జగన్ అన్ని పథకాలు విజయవంతంగా అమలు చేశారు. ఆర్బీకేలను నేను స్వయంగా వెళ్ళి పరిశీలించాను. ఆర్బీకే వ్యవస్థ దేశానికే రోల్ మోడల్. రైతులే దేశానికి అన్నం పెడుతున్నారు.. రైతుల సమస్యలను పరిష్కరించటం అసాధారణం. కోవిడ్ వంటి మహమ్మారిని సైతం ముఖ్యమంత్రి జగన్ అద్భుతంగా ఎదుర్కొన్నారు.. రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రికి భారీ మద్దతు ఇచ్చారన్నారు బిశ్వభూషణ్ హరిచందన్.
మా నాయకుల అంతిమ లక్ష్యం ప్రజల ప్రయోజనాలు, సమాజ అభివృద్ధి. సుహృద్భావ వాతావరణం గవర్నర్, శాసన, న్యాయ వ్యవస్థ మధ్య ఉండాలి. వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఊపిరి ఉన్నంత వరకు మీ అభిమానం, ప్రేమను మరిచిపోలేనన్నారు. ఆంధ్రప్రదేశ్ నా రెండో ఇల్లు. ముఖ్యమంత్రి జగన్ నన్ను కుటుంబ సభ్యుడిలా అభిమానించారన్నారు బిశ్వభూషణ్ హరిచందన్. నాకు మరొక టాస్క్ ఇచ్చారు. ఇక ఛత్తీస్ ఘడ్ వెళ్ళాల్సి ఉందన్నారు.
Read Also: Tollywood: ఈ వారానికి ఈ మూడే!
