NTV Telugu Site icon

CM Jagan Humanity: చిన్నారి భవ్యకు జగన్ భరోసా.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

Ys Jagan

Ys Jagan

తన సాయం కోరి వచ్చేవారికి సీఎం జగన్ భరోసా ఇస్తుంటారు. వైద్యం కోసం వచ్చేవారికి తనవంతూ సాయం అందిస్తూ ఆపద్బాంధవుడిలా మారుతుంటారు. ఎప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్ళినా తనను కలిసేందుకు వచ్చేవారికి సమయం కేటాయిస్తూ ఉంటారు. దివ్యాంగులకు, అంతుచిక్కని వ్యాధులతో బాధపడే పిల్లలకు అపారమయిన సాయం చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన మానవత్వం చాటుకున్నారు. సిఎం పాల్గొన్నే సభ ప్రాంగణం వద్ద చిన్నారికి వైద్య చికిత్స అందించాలంటూ తల్లితండ్రుల ఫ్లెక్సీలతో అభ్యర్థించారు. కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన ఆరేళ్ల భవ్య మెదడవాపు వ్యాధితో గత కొంతకాలంగా చికిత్స పొందుతుంది. ఆమె చికిత్సకు భారీగా ఖర్చవుతోంది.

Read Also: Punjab: అస్సాంకు అమృత్‌పాల్ సింగ్ అనుచరులను..భయానక వాతావరణం సృష్టించొద్దన్న సిక్కు సంస్థ

ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రిలో 20 లక్షలు ఖర్చు చేశామంటున్నారు తల్లిదండ్రులు. ఇంకా వైద్యానికి స్థోమత లేకపోవడంతో సిఎం జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్దించడానికి వచ్చామంటున్నారు భవ్య తల్లితండ్రులు. తమ బాధను సీఎంకి తెలియచేయాలని వారు ప్రయత్నించారు. అనంతరం వారు సిఎం ను కలిసి చిన్నారి భవ్య ఆరోగ్యపరిస్థితిని వివరించారు తల్లిదండ్రులు. తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలని సిఎంకు వినతి పత్రం అందించారు. పదినిముషాల పాటు చిన్నారి తల్లితండ్రులతో మాట్లాడి భవ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సిఎం జగన్. ఇప్పటికే 20 లక్షలు ఖర్చు పెట్టాం.. ఇక తమకు ఆర్దిక పరిస్దితి లేదంటూ సిఎం కు తెలిపారు చిన్నారి తల్లి,తండ్రులు. చిన్నారి భవ్యను మీరే ఆదుకోవాలని వారు అభ్యర్థించారు. తక్షణమే చిన్నారి భవ్యకు మెరుగైన వైద్య సేవలందించాలంటూ అధికారులకు సిఎం ఆదేశాలు జారీచేశారు. దీంతో భవ్య తల్లిదండ్రులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియచేశారు.

Read Also: CM Jaganmohan Reddy: అప్పుడు దోచుకో, పంచుకో, తినుకో .. ఇప్పుడు డీబీటీ

Show comments