CM Chandrababu: విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను… విద్యుత్ సంస్కరణలు తెచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 యంగ్ ప్రొఫెషనల్స్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. యంగ్ ప్రొఫెషనల్స్ గా నియమితులైన వారికి ప్రణాళిక శాఖ నియామక పత్రాలు అందించింది. నియోజకవర్గాల బలాలను బేరీజు వేయండి.. అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విజన్ తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని.. యంగ్ ప్రొఫెషనల్స్ ప్రభుత్వానికీ…నాకూ బలంగా ఉండాలని సూచించారు. ఏపీకి సెమికండక్టర్ యూనిట్ రావడం శుభపరిణామం.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటూ.. అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నియోజకవర్గాల వారీ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఒక యంగ్ ప్రొఫెషనల్ ను నియమిచిందని చెప్పారు. నియోజకవర్గానికో యంగ్ ప్రొఫెషనల్ నియమించడం కొత్త విధానం తెచ్చినట్లు తెలిపారు. తాను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యతాంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకున్నానన్నారు.
READ MORE: Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!
“యంగ్ ప్రొఫెషనల్స్ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సహా మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి కచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా పనిచేస్తే… సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి. సరైన విధానాలు అవలంభించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు యంగ్ ప్రొఫెషనల్స్ వివరించాలి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వస్తాయనే అంశంపైనా ముందుగా అంచనాలు వేయగలగాలి. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది.. అయినా ముందు చూపుతో నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాం. రికార్డు సమయంలో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేసి.. నీటిని విడుదల చేశాం. ఫలితంగా రాయలసీమ సహా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకున్న కెపాసిటీలో 80 శాతం మేర నీటిని నిల్వ చేసుకోగలిగాం. దీని వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి నియోజకవర్గానికీ ఓ బలం ఉంటుంది. అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయి. అలాంటి వాటిని యంగ్ ప్రొఫెషనల్స్ గుర్తించి.. అధ్యయనం చేయాలి. ఆ వనరుల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ మేం చేపడుతున్నాం.” అని సీఎం చంద్రబాబు సూచించారు.
READ MORE: Top Headlinews @9PM : టాప్ న్యూస్
