Site icon NTV Telugu

CM Chandrababu: 2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Cm Chandrababu

Cm Chandrababu

అమరావతి లో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ నిర్మాణం పై దృష్టి పెడతామన్నారు సీఎం చంద్రబాబు… రెండు రోజుల గ్రీన్ హైడ్రోజెన్ సమిట్ తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.. ఎస్ ఆర్ ఎం లో జరుగుతున్న రెండు రోజుల సమిట్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని తను బలంగా కోరుకుంటున్నా అన్నారు. గతంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదని.. చాలా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉండేది కాదన్నారు.. కరెంట్ కోతలు, లో వోల్టేజ్ సమస్యల పై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడేవారని.. తాను1999లో మొదటగా విద్యుత్ సంస్కరణలు అమలు చేశానన్నారు.. నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

READ MORE: Masood Azhar: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది?

2004లో తాము అధికారం కోల్పోవడానికి విద్యుత్ సంస్కరణలు అమలు చేయటం ఓ కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. 2014 తర్వాత సౌర, పవన విద్యుత్ తయారీకి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. దీని వల్ల విద్యుత్ ధరలు బాగా తగ్గాయని.. 1995లో శ్రీశైలం లో రివర్స్ పంప్ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామన్నారు. అత్యధిక విద్యుత్ డిమాండ్ అధిగమించేందుకి అది ఉపయోగపడిందని..గ్రీన్ హైడ్రోజన్ తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వటం సాధ్యమన్నారు. ప్రధాని మోదీ 2030 కల్లా 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు. ఇందులో ఏపీ మెజార్టీ భాగస్వామ్యం వహించాలని కోరారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ రవాణాకు అవసరమైన సౌకర్యాలు మనకు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో కేంద్రం, ఎన్టీపిసి గ్రీన్ హైడ్రోజన్ తయారీ దిశగా చర్యలు చేపట్టాయని.. మన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల కు ఒక పోర్టు ఉండాలని తన లక్ష్యమన్నారు. 160 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్తు తయారీ లక్షం నిర్దేశించినట్లు తెలిపారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హరితఇంధన తయారీ కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.

READ MORE: Huawei Mate XT 2: ట్రిపుల్-ఫోల్డ్ డిజైన్‌, సరికొత్త చిప్‌సెట్, శాటిలైట్ కనెక్టివిటీలతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్దమైన టెక్ దిగ్గజం హువావే..!

“రిలయన్స్ వంటి కంపెనీలు రాష్ట్రంలో బయో గ్యాస్ తయారీ పై పెట్టుబడులు పెడుతున్నాయి. హరిత ఇంధన తయారీ విషయంలో ఏపికి చాలా అనుకూలతలు ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ కు భారీగా నీరుఅవసరం, మనకు సముద్రం పక్కనే ఉండటం మంచి అవకాశం. కృత్రిమ మేధ కేంద్రంగా క్వాంటం వ్యాలీ అమరావతి లో ఏర్పాటు చేస్తున్నాం. అదే క్రమంలో అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రకృతి ని కాపాడటం కూడా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ముఖ్య ఉద్దేశం. ఇంధన తయారీ ఖర్చును తగ్గించడం పై యువత దృష్టి సారించాలి. రెండు రోజుల సదస్సు తర్వాత అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఏడాది తర్వాత మళ్లీ సదస్సు నిర్వహించి డిక్లరేషన్ అమలు పై సమీక్షిస్తాం.ప్రధాని మోదికి కూడా సాంకేతికత విషయంలో మంచి అవగాహన స్పష్టత ఉంది.” అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణపట్నంలో16 వేల కోట్లు, మచిలీపట్నంలో 35 వేల కోట్లు పెట్టుబడితో హరిత ఇంధన తయారీ సంస్థల ఏర్పాటు పై కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు అందుకున్నారు.

Exit mobile version