NTV Telugu Site icon

Viral Video : అరె ఏంట్రా మీరు .. ఇది చూస్తే చాక్లేట్స్ తినరు..

chocolate pokoda

chocolate pokoda

సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం రకరకాల వీడియోలను, ప్రయోగాలు చేసి పెడుతున్నారు.. అందులో వింత వంటలను చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎన్నో నెట్టింట వైరల్ అవుతుంది.. అందులో కొన్ని వీడియోలు అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. ప్రస్తుతం రైనీ సీజన్ సాయంత్రం అయితే వేడి వేడిగా ఏదైనా చేసుకోవాలని అనుకుంటున్నారు.. పకోడీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు చాలామంది ఇష్టంగా తింటూ వుంటారు..

ఇక వ్యాపారులు కూడా రకరకాల బజ్జిలను వేస్తారు.. ఎగ్ బోండా, టమాటా బోండా, క్యాప్సికం బోండా, అరటికాయ బజ్జి, వంకాయ బజ్జీ్లీ,ఇలా రకరకాల వంటకాలు మార్కెట్లో ఆహారప్రియులను ఊరిస్తూ ఉంటాయి.. సాధారణంగా ఇష్టమైన వెజిటబుల్స్‌ని సెలక్ట్ చేసుకుని శనగపిండిలో ముంచి వాటిని క్రిస్పీగా గోధుమ రంగు వచ్చేవరకూ నూనెలో వేయిస్తూ వుంటారు. అయితే డైరీ మిల్క్ సిల్క్ పకోడా ఎలా ఉంటే అదే శనగపిండిలో వెజిటబుల్ బదులు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బార్ ను బజ్జి పిండిలో ముంచి వేస్తారు.. పైన కారంగా లోపల తియ్యగా.. అదో వెరైటీ గా ఉందని జనాలు తినడానికి ఎగబడుతున్నారు..

డైరీ మిల్క్ సిల్క్ పకోడా ఎలా ఉంటే అదే శనగపిండిలో వెజిటబుల్ బదులు డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బార్‌ను ముంచి వేడి నూనెలో వేయిస్తారన్నమాట.. ఇది వైరల్ అవ్వడంతో పకోడీని ఇష్టపడేవారు వుంటారు. చాక్లెట్ బార్ ఇష్టపడే వారు ఉంటారు. అలాగని ఈ రెండిటిని కలిపి ఇలా చేయడం చాలా దారుణం అంటూ నెటిజన్లు వాపోతున్నారు.. ఇలా ఎందుకు రా జనాలను చంపేస్తారు అంటూ కామెంట్ల అంటూ వరుస కామెంట్స్ తో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..