KAAKA Release Date:: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చిత్రబృందం తెరదించింది. ముందుగా ప్రకటించినట్టుగానే 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా స్పష్టం చేసింది. సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలకు ఈ ప్రకటనతో చెక్ పెట్టింది.
దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. ‘‘ఆటో జానీ గుర్తున్నాడా..? ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKAలో మీ ముందుకు వస్తున్నాడు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో చిరంజీవి తన పాత సినిమా ‘రౌడీ అల్లుడు’లోని ఆటో జానీ తరహా పాత్రలోనూ కనిపించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మరోవైపు ఈ సినిమా నుంచి తొలి పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ‘కాకా’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజా ప్రకటనతో 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా విడుదల ఖరారైంది.
The ICONIC AUTO JOHNNY is back, but this time, with a whole new MEGA dimension! 🔥
When Megastar @KChiruTweets garu steps into this avatar, expect nothing less than an explosive mix of MASS, SWAG and MADNESS! ❤️🔥
This Sankranthi, the theatres are about to witness a MEGA STORM! 🤙🤙
#KAAKA | JANUARY 13, 2027 💥
Produced by @TheKVNofficial @KvnProductions
#AnaswaraRajan @Nivetha_Tweets @anuragkashyap72 @musicthaman @vijaykartikdop @AntonyLRuben @artkolla @saranyapotla @konavenkat99 @Chakrif1 @Yugandhart_ @vforvineeth @UrsVamsiShekar @HaashtagMedia @KaakaMovie @zeemusicsouth #KAAKAOnJan13
— Bobby (@dirbobby) November 29, 2026

