Site icon NTV Telugu

Chinese Employees: టార్గెట్ కంప్లీట్ చేయలేదని ఎంప్లాయిస్ తో.. కాకరకాయ తినిపించిన కంపెనీ

China Bitter Gourd

China Bitter Gourd

మామూలుగా కార్పోరేట్‌ కంపెనీల్లో పని ఒత్తిడి, టార్గెట్స్‌, షిఫ్ట్స్‌ ఉంటాయన్న అందరికి తెలుసు. తమకు ఇచ్చిన టార్గెట్‌ రీచ్‌ అవ్వడానికి కొన్నిసార్లు ఉద్యోగులు నిద్రాహారాలు మానేసి మరీ వర్స్ చేస్తుంటారు. కానీ టైం బ్యాడ్‌ అయితే కొన్నిసార్లు టార్గెట్‌ను రీచ్‌ కాలేక కంపెనీ నుంచి చివాట్లు తినాల్సిందే. అయితే చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగుల విషయంలో ఓరాక్షన్ చేసింది. టార్గెట్స్‌ రీచ్‌ అవ్వని ఉద్యోగులపై ఆ కంపెనీ వెరైటీ శిక్షను వేసింది. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చినా తగ్గేదేలే అని సదరు సంస్థ క్లారిటీ ఇచ్చేసింది.

Read Also: Modi Hyderabad Tour: హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. టూర్ షెడ్యూల్ ఇదే

ఓ చైనా కంపెనీ ఉద్యోగులతో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. టార్గెట్లు పూర్తిచేయని ఉద్యోగులతో కంపెనీ యాజమాన్యం బలవంతంగా కాకరకాయలను తినిపించింది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. టార్గెట్‌ను పూర్తి చేయడంలో విఫలమైన ఎంప్లాయిస్ తో సదరు కంపెనీ పచ్చి కాకరకాయలను తినిపించింది.

Read Also: Loksabha Election : 2024లో ప్రతిపక్షాల ఐక్యత మోడీని ఓడించగలదా ? ప్రజల అభిప్రాయం ఏంటి?

దీనికి సంబంధించిన వీడియోను జాంగ్ అనే ఉద్యోగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌ అవుతుంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరించిన తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కంపెనీ ఆ విమర్శలను తిప్పికొడుతూ..ఇది రివార్డ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌ విధానంలో భాగమని, ఉద్యోగులు ఇందుకు ముందుగానే అంగీకరించారని సదరు కంపెనీ పేర్కొంది. ఏది ఏమైనా ఉద్యోగులతో కంపెనీ ప్రవర్తించిన విధానం చాలా తప్పని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్స్ ను పూర్తి చేయకపోవడంతో వారిని ఫైర్ చేస్తున్నారు.. లేదంటే జీతాల్లో కోత, శిక్షను విధిస్తున్నారు.

Exit mobile version