India-Paksitan War: చైనా వక్ర బుద్ధి మరోసారి బట్టబయలైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ ఘర్షణను చైనా కొత్త సైనిక హార్డ్‌వేర్‌ను పరీక్షించడానికి ఉపయోగించుకుంది. ఈ సమాచారాన్ని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. ఇరు దేశా మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణను బీజింగ్ ప్రత్యక్ష పరీక్షా కేంద్రంగా ఉపయోగించుకుందని నివేదిక వెల్లడించింది. కొత్తగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పరిధి, మెరుగుదలను పరీక్షించడానికి చైనా ఉపయోగించుకుందని US-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ తెలిపింది.
READ MORE: President Draupadi Murmu: సత్యసాయి బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి..
యూఎస్ నివేదిక ప్రకారం.. చైనా నూతనంగా తయారు చేసిన, ఆధునికీకరించిన HQ-9 వాయు-రక్షణ వ్యవస్థ, PL-15 గాల్లోనే లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, J-10 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు వచ్చింది. లైవ్ టెస్ట్ ట్రైల్ కోసం చైనా ఆ ఆయుధాలను పాకిస్థాన్‌కు ఇచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆయుధాలను పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఉపయోగించింది. దీంతో చైనా తమ ఆయుధాల పని తీరును సమీక్షించింది. అంతేకాదు.. జూన్ 2025లో పాకిస్థాన్‌కు 40 J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్‌లు, KJ-500 విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి చైనా ఆఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇలా జిత్తులమారి చైనా ఆయుధాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడమే కాకుండా.. తమ దేశం తయారు చేసిన కొత్త ఆయుధాల పనితీరును సులభంగా పరీక్షించింది. అంతే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనా రాయబార కార్యాలయాలు ఇరు దేశాల ఘర్షణలో ఉపయోగించిన చైనా ఆయుధాలను ప్రశంసిస్తూ అమ్మకాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని నివేదిక నొక్కి చెప్పింది.
READ MORE: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
మరోవైపు.. ఇండోనేషియా ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. దీంతో ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలను అప్రతిష్టపాలు చేయడానికి చైనా తప్పుడు సమాచార ప్రచారాన్ని ప్రచారం చేసింది. ఫ్రెంచ్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. చైనా తన సొంత J-35 యుద్ధ ప్రశంసిస్తూ.. ఫ్రెంచ్ రాఫెల్‌ల అమ్మకాలను అణగదొక్కడానికి ప్రయత్నించింది. AI, వీడియో గేమ్ చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ.. చైనా ఆయుధాలు నాశనం చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు ఇవే అంటూ ప్రచారం చేసింది. ఇండోనేషియా ఫ్రెంచ్ విమానాలను కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది.
