NTV Telugu Site icon

Chandramukhi 2: చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్.. అదిరిపోలా!

Chandramukhi 2

Chandramukhi 2

Chandramukhi 2: కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ చేసి హీరోగా, తర్వాత సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాసకరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ డైరక్టర్ పి.వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన చంద్రముఖి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 రూపొందుతుంది. కాగా చిత్ర బృందం సోమవారం ఈ సినిమాలో హీరో రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

Read Also:CM Jagan : ఏపీలో మహిళలకు శుభవార్త.. ఆగస్టు10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం

రాఘవ లారెన్స్ ఈ లుక్ లో రాజులా కనిపిస్తున్నారు. రాజసంతో కూడిన పొగరు ఫోజులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లుక్ మొత్తానికి అదిరిపోయింది. లుక్‌తోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పారు. లారెన్స్ తన ముని సిరీస్ లో ఏవిధంగా భయపెట్టారో అదే తరహాలో ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను థ్రిల్లింగ్ తో కూడిన భయానికి గురిచేస్తాడని స్పష్టంగా అర్థమైపోతుంది. 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమాను మించి ఇది బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని సిని వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా తీసుకురానుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం.. అంతే కాకుండా దిగ్గజ సినిమాటోగ్రాఫర్ ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే జాతీయ అవార్డ్ గ్రహీత తోట త‌ర‌ణి ప్రొడక్షన్ డిజైనింగ్, ఆంథోని ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. కమెడియన్ వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్ వంటి సీనియర్ నటులు ఎంతో మంది ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read Also:Bhagavanth Kesari: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై సాంగ్ షూట్.. రచ్చ రచ్చే అంటున్నారే!

Show comments