Chandramukhi 2: ‘చంద్రముఖి2’ అందరికీ నచ్చుతుంది- రాఘవ లారెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు.. ఈయన హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు..
ఈ సందర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘రెబల్ తరువాత నాకు డైరెక్షన్ చేసే టైం కుదరలేదు. ఇలా చంద్రముఖి 2 సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంటారు. నేను ఎప్పుడూ దేవుడ్ని చూడలేదు. ఈ ప్రేమ పేరే దేవుడని అనుకుంటున్నాను. నేను డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రతీ హీరో అభిమాని నాకు ఫ్యాన్ అయ్యారు. నాకు ఛాన్స్ ఇచ్చిన హీరోలందరికీ థాంక్స్.
Also Read
ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ థాంక్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి చెప్పాలి. ఆయన నటించిన చిత్రంలో నేను నటించాను. నా లైఫ్‌లో నేను ముగ్గురినీ ఎప్పుడూ మరిచిపోను. రజినీ కాంత్ గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అభిమానం నాకు వచ్చేది కాదు. డైరెక్షన్ ఛాన్స్‌ను నాగార్జున గారు ఇచ్చారు. కీరవాణి గారికి మ్యూజిక్ తప్పితే ఇంకేం తెలియదు. అదే లోకంలో ఉంటారు. ఆయన సంగీత సారధ్యంతో మేం పని చేయడం ఆనందంగా ఉంది. నేను గ్రూప్ డ్యాన్సర్‌గా పని చేస్తున్నప్పటి నుంచీ పి. వాసు దర్శకత్వం వహిస్తూనే ఉన్నారు. ఈ వయసులోనూ ఆయన చాలానే కష్టపడుతుంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చతుందని ఆశిస్తున్నాను. నిర్మాత సుభాస్కరణ్ గారు దివ్యాంగుల కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు. నేను కూడా నా వంతు సాయం చేస్తున్నాను. కంగనా గారితో నటించాలని అందరికీ డ్రీమ్ ఉంటుంది. నాకోరిక తీరింది.. ఆమెతో సినిమా చేశానని లారెన్స్ చెప్పుకొచ్చారు.. లారెన్స్ స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘నేను గతంలో దక్షిణాదిన సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్, తలైవి వంటి సినిమాల్లో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో మీ ముందుకు వస్తున్నా. ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఇంకా ఎవరినీ తీసుకోలేదని చెప్పడంతో. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను.’ అని ఆమె చెప్పింది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచాయి.. సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
-
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..