NTV Telugu Site icon

Chandra Sekhar Pemmasani : సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

Chandra Sekhar Pemmasani

Chandra Sekhar Pemmasani

Chandra Sekhar Pemmasani : గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు కామెంట్స్ చేసాడు. గడిచిన 5 ఏళ్లు గా వైసిపి పాలనలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని., ఆగిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేశామన్నారు. తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ పనులకు కేటాయించిన సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని., నిధులు లేకపోవడం వల్లే గుంటూరు పట్టణంలో తాగునీరు కొరత, అండర్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.

Kaushik Reddy: మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీకు బ్లాక్ డెస్..

గుంటూరు ప్రాంతంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో గుంటూరు నగరాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తామని., నిధులు సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు ప్రాంత అభివృద్ధిపై ప్రతి వారం రోజులకు ఒకసారి సమీక్ష జరుపుతామని ఈ సభలో ఆయన పేర్కొన్నారు.

The Goat : విజయ్ ‘ది గోట్ ‘ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..