Water Crisis : దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన వేడిగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చాలా చోట్ల ఎండ వేడిమికి ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేశ రాజధాని కూడా దీని బారిన పడక తప్పలేదు. ఇక్కడ కూడా నీటి కోసం ప్రజలు చిన్న పాటి యుద్ధాలనే చేస్తున్నారు. మరోవైపు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండుటెండల మధ్య దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ స్థాయి తగ్గుముఖం పట్టిందని సీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. మొత్తం స్టోరేజీ కెపాసిటీలో 23 శాతం నీరు మిగిలి ఉండడం ఆందోళన కలిగించే అంశం. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టం 77 శాతం తగ్గింది.
రిజర్వాయర్లలో 23 శాతం నీరు
ఈ రిజర్వాయర్లలో 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు కేంద్ర జల సంఘం శుక్రవారం వెల్లడించింది. ఇది మొత్తం నిల్వ సామర్థ్యంలో 23 శాతం. కేంద్ర జల సంఘం డేటా విడుదల చేసిన 150 రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్ల . దేశంలోని 150 రిజర్వాయర్లలో పది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ లలో ఉన్నాయి.
Read Also:New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్రమిస్తే అంతే సంగతి..!
గతేడాది ఈ సమయానికి 38 శాతం నీరు
వాటి నిల్వ సామర్థ్యం 19.663 బిలియన్ క్యూబిక్ మీటర్లు. మే 16 – మే 31 మధ్య ఈ సంఖ్య 5.864 బిలియన్ క్యూబిక్ మీటర్లకి చేరుకుంది. ఇది మొత్తం సామర్థ్యంలో 30 శాతం. గతేడాది ఈ సమయానికి 38 శాతం నీటి మట్టం ఉంది. తూర్పు భారతదేశంలోని అస్సాం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లలో మొత్తం 23 రిజర్వాయర్లు ఉన్నాయి.
గుజరాత్ , మహారాష్ట్రలో మొత్తం 49 రిజర్వాయర్లు
వాటి నిల్వ సామర్థ్యం 20.430 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న నీరు 5.645 బిసిఎం అని, ఇది మొత్తం సామర్థ్యంలో 28 శాతం అని సిడబ్ల్యుసి తెలిపింది. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్రలో మొత్తం 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి నిల్వ సామర్థ్యం 37.130 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ప్రస్తుతం 8.833 బిసిఎంల నీరు ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో 24 శాతం. ఇది గతేడాది 28 శాతం కంటే తక్కువ. అయితే, సాధారణ నిల్వ 23 శాతం కంటే మెరుగ్గా ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి నిల్వ సామర్థ్యం 48.227 BCM. ప్రస్తుతం ఇందులో 14.046 బిసిఎం నీరు ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో 29.1 శాతం. గతేడాది ఇది 37 శాతంగా ఉంది.
Read Also:Kondagattu: నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు..
