Site icon NTV Telugu

India-Pak War : నిత్యవసర సరుకులపై ఆందోళన వద్దు.. కేంద్ర కీలక సూచన

India Pak War

India Pak War

India-Pak War : భారత్-పాకిస్థాన్ యుద్ధ వాతవారణ సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని రకాల నిత్యవసరాలపై కేంద్రం కీలక సూచనలు చేసింది. దేశ వ్యాప్తంగా నిత్యవసర సరుకుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దేశ వ్యాప్తంగా కావాల్సినన్ని నిత్యవసర సరుకుల నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. ఎవరూ పరిమితికి మించి నిల్వలు చేయొద్దని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల ఆహార అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ తెలిపింది. అటు చండీఘడ్ లో ఆహార నిల్వలను నిషేధించారు కేంద్ర అధికారులు.

Read Also : Nawaz Sharif: భారత్‌తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..

కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. సరుకుల ధరలు పెరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పాక్ సరిహద్దు జిల్లాల్లో కేంద్రం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎక్కడా సరుకులు నిల్వ ఉంచకుండా నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు అటు ప్రైవేట్ భాగస్వాములను కూడా ఆదేశిస్తోంది. ఎప్పటికప్పుడు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు కేంద్ర అధికారులు. అవసరం అయితే అత్యవసర అధికారాలు వినియోగించుకోవాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు పంపింది కేంద్ర ప్రభుత్వం.

Read Also : India Pakistan war: ఆ డ్రోన్లు టర్కీకి చెందినవి.. పాక్ దాడిపై కల్నల్ సోఫియా ఖురేషీ..

Exit mobile version