ఐటీ మినిస్టర్ పేషీ పేరుతో ఓ వ్యక్తి రూ. 1.77 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ కళ్యాణ్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సీసీఎస్ కు బదిలీ అయ్యింది. అయితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారీ ప్రభుత్వ ఐటీ ప్రాజెక్ట్ మోసం సెప్టెంబర్ లోనే కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఓదురి వి.వి. సత్యనారాయణ అలియాస్ సతీష్ తో పాటు అజయ్ సేతుపతి, విశ్వనాథ్ అరబాటి, నమనా రాఘవ, ఆదబాల మణికాంత, తోట శ్రీనివాస్, ఇతరులు ఉన్నట్లు తెలిపారు.
Also Read:Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి దీపావళి పోస్టర్
నిందితులు ఐటీ శాఖ ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ రూ. 1.77 కోట్ల మోసానికి పాల్పడ్డారు. నకిలీ పత్రాలు, ఓఎస్‌డీ లెటర్‌హెడ్లు, మంత్రివర్గ చాంబర్ పేర్లను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. తెలంగాణ సచివాలయంలోనూ సమావేశాల సమయం వంటి నకిలీ సన్నివేశాలతో మోసగాళ్లు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బాధితుడు ఐటీ ప్రాజెక్ట్‌ల పేరుతో వందకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల పేరుతో మోసగాళ్ల సంఘం దేశవ్యాప్తంగా మోసానికి పాల్పడుతోంది.
Also Read:Nijamabad : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్!
కాగా పేషీ స్కామ్‌పై వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం స్పష్టం చేసింది. మోసం చేసిన వారు బయటి వ్యక్తులేనని స్పష్టం చేసింది. పేషీ ఉద్యోగులు, అధికారులకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. నకిలీ పత్రాలతో మోసం చేసిన నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి కార్యాలయం ప్రాజెక్టులు మంజూరు చేయదని, ఎవరైనా మభ్యపెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
