NTV Telugu Site icon

Manipur: మణిపూర్‌ అల్లర్లు.. మరో 9 కేసులు విచారించనున్న సీబీఐ

Cbi

Cbi

Manipur: మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోగా ఇదే విషయంపై పార్లమెంట్ కూడా దద్దరిలింది. ఈ ఘటనలకు సంబంధించి అనేక కేసులను సీబీఐ విచారిస్తోంది. అధికారులపై సైతం వర్గ ముద్ర పడుతూ ఉండటంతో విచారణలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఈ కేసుల విచారణను కేంద్రదర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగించడం జరిగింది.

Also Read:Prashant Kishore: ఆ సీఎంకు చదువు రాదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఘాటు వ్యాఖ్యలు

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుతో సహా ఎనిమిది కేసులు ప్రస్తుతానికి సీబీఐ చేతిలో ఉన్నాయి. అయితే వీటికి అదనంగా ఈ అల్లర్లకు సంబంధించి మరో 9 కేసులను సీబీఐ విచారించనుంది. చురాచంద్‌పుర్‌ జిల్లాలో చోటు చేసుకున్న మరో లైంగిక వేధింపుల కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మొత్తంగా 17 కేసులను సీబీఐ విచారించనుంది. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన కేసులన్నింటినీ కూడా సీబీఐకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వివిధ కేసుల్లో సేకరిస్తున్న అన్ని రకాల ఫోర్సెనిక్‌ శాంపిళ్లను సెంట్రల్‌ ఫోర్సెనిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీకి పంపిస్తోంది సీబీఐ. మహిళలపై జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి సీబీఐ మహిళా అధికారులను కూడా నియమించింది.