Site icon NTV Telugu

KL University: న్యాక్ అక్రిడేషన్ కోసం లంచాలు.. KL యూనివర్సిటీపై సీబీఐ కేసు

Cbi

Cbi

గుంటూరులోని KL యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది.. యూనివర్సిటీ అధికారులు న్యాక్ (NAAC) అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చిన ఘటనలో కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐ తేల్చింది. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ తో పాటు మొత్తం10మంది అరెస్ట్  చేసింది.. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు విజయవాడలోని కేఎల్​యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. సీబీఐ అధికారులు రూ.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

READ MORE: Hyderabad :గచ్చిబౌలి కాల్పుల ఘటనలో కీలక అప్డెట్.. నిందితుడిపై 80 కేసులు..

కాగా.. దేశంలోని 20ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌, గౌతమ్‌ బుద్ధనగర్‌, న్యూఢిల్లీలోని 20 చోట్ల న్యాక్‌ బృందం సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఈ కేసులో కేఎల్​యూ యాజమాన్య ప్రతినిధులతోపాటు, దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నట్లు తెలిసింది. లంచాలను నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల రూపంలో ఇచ్చినట్లు సమాచారం.

READ MORE: Budget 2025 : బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రిని చుట్టుముట్టిన ఎంపీలు, ప్రధాని.. ఎందుకంటే ?

 

Exit mobile version