ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలింది. తీహార్ జైల్లో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవలే లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు.. తీహార్ జైల్లో కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆమెను జైల్లో సీబీఐ విచారించింది. విచారణ అనంతరం గురువారం కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీకి తరలించారు. కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఇదే కేసులో విచారించేందుకు కోర్టును సీబీఐ అనుమతి కోరింది. దీనికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విచారణ అనంతరం సీబీఐ జైల్లో కవితను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తన కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్ వేసింది. కానీ న్యాయస్థానంలో ఊరట లభించలేదు. పిటిషన్ కొట్టేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కూడా త్వరలో ధర్మాసనం విచారించనుంది.
