Site icon NTV Telugu

Kavitha: కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ వెంకట్ ఫిర్యాదు..!

Kavitha

Kavitha

Kavitha: మాజీ ఎమ్మెల్సీ కవిత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై చేసిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 2న కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినట్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఆరోపించారని గుర్తు చేశారు. ఓ నలుగురు వ్యక్తులు కేసీఆర్‌కు తెలియకుండానే రాష్ట్ర సంపదను రాబందుల్లా దోచేశారని కవిత ఆధారాలతో ఆరోపించారు అని వెంకట్ పేర్కొన్నారు.

Affordable Smart Projector: 100-inch TV ఇప్పుడు రూ.5,000లో!

ఇదే అంశంపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పాం. గత ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మును రాబట్టి వాటితో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము అని బల్మూర్ వెంకట్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడినట్లు బీఆర్‌ఎస్ ‘బాకీ కార్డుల’ ఆరోపణలతో ప్రచారం చేస్తుండటంపై వెంకట్ మండిపడ్డారు. నిజానికి రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుతిన్నది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. వారు దోచుకున్న ఆ అవినీతి సొమ్ము వెలికి తీస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేయవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. కవిత ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

KTR: మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ తుక్కు తుక్కు కావాలి..!

Exit mobile version