NTV Telugu Site icon

Captain Miller : రెండు పార్ట్ లు గా తెరకెక్కబోతున్న ధనుష్ మూవీ…?

Whatsapp Image 2023 10 14 At 4.16.53 Pm

Whatsapp Image 2023 10 14 At 4.16.53 Pm

దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించి భారీ విజయం సాధించిన తర్వాతి నుంచి సినీ ఇండస్ట్రీ లో మూవీని రెండు పార్ట్ లుగా తెరకెక్కించే ట్రెండ్ జోరుగా సాగుతోంది.భారీ బడ్జెట్ చిత్రాలను రెండు పార్ట్‌లుగా తీసుకొచ్చేందుకు కొందరు మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ ట్రెండ్‍ను కొనసాగిస్తున్నారు.ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ కూడా రెండు పార్ట్‌లుగా రావడం ఖాయమైనట్లు తెలుస్తుంది…1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ రూపొందుతోంది.ధనుష్ ఈ సినిమాలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే వీరుడు కెప్టెన్ మిల్లర్ పాత్ర చేస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, కెప్టెన్ మిల్లర్ మూవీ రెండు భాగాలుగా రావడం ఖాయమైందనే సమాచారం తాజాగా బయటికి వచ్చింది. ఈ విషయంపై సినీ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ రెండు భాగాలుగా రావడం కన్‍ఫామ్ అయిందని పేర్కొన్నారు.

కెప్టెన్ మిల్లర్ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, ప్రియాంక అరుల్ మోహన్, అదితి బాలన్, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సొన్నెన్‍బ్లిక్, నివేదిక సతీశ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన కెప్టెన్ మిల్లర్ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.కెప్టెన్ మిల్లర్ సినిమాను డిసెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇది తొలి భాగంగా ఉండే అవకాశం ఉంది. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానుండడంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కెప్టెన్ మిల్లర్ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.అయితే టీజర్లో సినిమాటోగ్రఫీ ఎంతో హైలైట్‍గా నిలిచింది.

https://twitter.com/ManobalaV/status/1713091976894308752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1713091976894308752%7Ctwgr%5E373cf032ebce2df1f07c54f0818a2d41cbec5659%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F