మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? దాని నుండి చక్కటి డబ్బులని సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియాను మీరు చూడాలి. ఈ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇంకా మంచిగా డబ్బులు వస్తాయి పైగా రిస్క్ ఉండదు ప్రభుత్వం కూడా సహాయం ఇస్తోంది కాబట్టి పెట్టుబడి విషయంలో మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి వెదురు బాటిల్స్ తయారీ.. ఈ వ్యాపారం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వాడకం తగ్గింది.. చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేసారు దానికి బదులుగా వెదురు బాటిల్స్ ని ఉపయోగిస్తే మంచిది. వెదురు బాటిల్స్ ని తయారు చేసేసి మీరు వాటిని సేల్ చేయొచ్చు. వీటివలన ఆరోగ్యం బాగుంటుంది పైగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇవి లీటర్ కన్నా తక్కువగానే ఉంటాయి.. వీటి ధర ఒక్కో బాటిల్ కు రూ. 300 రూపాయలు ఉంటుంది..
కానీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రకారం చూస్తే వెదురు సీసాల తయారీలో శిక్షణ తీసుకోవడానికి నేషనల్ వెదురు మిషన్ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తోంది. దీని ద్వారా మీరు ఈ బాటిల్స్ ని ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని వివరంగా తెలుసుకోవచ్చు.. ఈ బిజినెస్ చెయ్యడానికి మీకు రూ.15 లక్షలు కావాలి.. మీరు పార్ట్నర్ షిప్ కింద చూసుకుంటే తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ ఉపాధిని మెరుగుపరచడానికి MSME మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది.. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది.. ఆదాయం కూడా బాగానే ఉంటుంది.. ఈ వ్యాపారం చెయ్యడం వల్ల నష్టాలు తక్కువ అనే నిపుణులు చెబుతున్నారు..
