Site icon NTV Telugu

Burra Venkatesham : అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు.. TGPSC చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు..

Burra Venkatesham

Burra Venkatesham

Burra Venkatesham : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఏప్రిల్ తరువాతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 2025 మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి జాప్యం లేకుండా ఫలితాలు త్వరగా విడుదల చేసే విధానాన్ని తీసుకుంటామన్నారు.

Health Tips : ఆ కారణంగా ప్రజల్లో పెరుగుతున్న మతిమరుపు.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ఈ రోజు గ్రూప్ 3 ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే వారం పదిరోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.

టీజీపీఎస్సీ సిలబస్‌పై కూడా సర్వే చేస్తున్నామని, గ్రూప్-3కి మూడు లేదా నాలుగు పేపర్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. UPSC, SSC విధానాన్ని అనుసరించాలని నిర్ణయించామని చెప్పారు. యూపీఎస్సీ ప్రతి ఏడాది 5 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, టీజీపీఎస్సీ కూడా కొన్ని కంప్యూటర్ బేస్డ్, మరికొన్ని మ్యాన్యువల్ పరీక్షలను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

ఇక నుండి క్వశన్ పేపర్ విధానాన్ని మారుస్తామని, ముందుగా క్వశన్ బ్యాంక్ తయారుచేసి దానినుంచి పేపర్లు సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రతి సబ్జెక్టులో 5,000 నుంచి 10,000 వరకు ప్రశ్నలను రూపొందించి, వాటి ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.

మార్చి 31లోపల ప్రభుత్వానికి వెకెన్సీ లిస్టు అందించాలని, ఏప్రిల్‌లో భర్తీ ప్రక్రియపై కసరత్తు చేసి, మే 1నుండి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. అలాగే, ఇంటర్వ్యూ ఉండే పోస్టులను సంవత్సరంలో, ఇంటర్వ్యూ లేని వాటిని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై ఉన్న అపనమ్మకాన్ని దూరం చేస్తూ, వారికి నమ్మకం కలిగించే విధంగా పనిచేస్తున్నామన్నారు.

Haindava : ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్: బెల్లంబాబు సినిమాకి హిట్ కళ కనిపిస్తోందే!!

Exit mobile version