NTV Telugu Site icon

Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?

New Project (10)

New Project (10)

Bungee Jumping : చాలా మంది పర్యాటకులు బంగీ జంపింగ్‌ను ఇష్టపడతారు. కాస్త ప్రమాదకరమే అయినా.. వినోదం అవసరం కాబట్టి పర్యాటకులు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవాలను ఆస్వాదిస్తున్నారు. బంగీ జంపింగ్‌లో అన్ని సేఫ్టీ ప్రోటోకాల్‌లను పాటించినప్పటికీ, కొన్నిసార్లు భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

థాయ్‌లాండ్‌లోని ఒక ఉద్యానవనంలో మైక్ అనే యువకుడు బంగీ జంప్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తాడు తెగి కింద పడిపోయాడు. అక్కడ మురికి నీరు ఉంది. ఆ నీటిలో పడిపోయాడు. దీంతో అతడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. థాయ్‌లాండ్‌లో సెలవులను ఎంజాయ్ చేయడానికి మైక్ తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో తనకు ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిందని స్థానిక మీడియాకు మైక్ తెలిపాడు.

Read Also: Ravi Shastri : ఐసీసీ ట్రోఫీ కరువులో టీమిండియా.. మీకు ఓపిక లేదు: భారత మాజీ హెడ్ కోచ్

హాంకాంగ్‌కు చెందిన మైక్ ఫిబ్రవరిలో తన స్నేహితుడితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లాడు. ఇద్దరూ బంగీ జంపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలోనే మైక్ ప్రమాదానికి గురయ్యాడు. వీడియోలో మైక్ సుమారు 10 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌పై చేతులు చాచి నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. బంగీ జంపింగ్ చేస్తుండగా తాడు తెగిపోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర ప్రమాదం నుంచి యువకుడు తృటిలో తప్పించుకున్నాడు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్.. ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం..

ఈ ప్రమాదంలో, అతను ఛాతీ భాగంతో తీవ్ర గాయమైంది. నీళ్లలో పడడం వల్ల నా మోకాళ్లు వాచిపోయి ఎడమ కన్ను కూడా దెబ్బతింది. అదృష్టవశాత్తూ బతికి బయట పడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత థాయ్‌లాండ్ టూరిజం నుంచి ఎలాంటి సహాయం అందలేదని మైక్ ఆరోపించారు. నోటిలోకి మురికి నీరు రావడంతో అతని గొంతులో ఇన్ఫెక్షన్ సోకింది. దానికి కూడా చాలా ఖర్చు అయిందని వాపోయాడు.