ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also read: Google Chrome: సెక్యూరిటీ అలెర్ట్.. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అప్డేట్ చేయకపోతే రిస్కె..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో చూస్తే అందులో ఓ రెండు ఎద్దులు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి. అది కూడా ఓ దుస్తుల దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. దుకాణంలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎద్దులను చూసి షాప్ లో ఉన్న ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. అలా వారు బయటకు వచ్చిన తర్వాత ఓ ఎద్దు మరో ఎద్దు పై దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ గొడవలో అవతలి ఎద్దు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న అదుపు తప్పి ఆ షాపులోని దుస్తులపై పడింది. ఈ నేపథ్యంలో ఎద్దు చేసిన పనికి షాపులోనే దుస్తులని నేలపై పడ్డాయి.
Also read: Rinku Singh: తుది జట్టులో లేనని తెలిసి గుండె పగిలినట్లైంది.. తల్లితో రింకూ సింగ్ భావోద్వేగం
షాపులోనే దుస్తులని నేలపై పడడంతో ఆవులు వాటిని చిందరవందరగా చేశాయి. ఈ సమయలో మొత్తం ప్రజలు షాపు బయట నిలబడి భయం భయంగా చూస్తున్నారు. రెండు ఎద్దులు అంత బీభత్సాన్ని సృష్టిస్తున్న సమయంలో లోపలికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ఆ ఎద్దులు చాలాసేపు వరకు బట్టల దుకాణంలో బీభత్సాన్ని సృష్టించాయి. బీభత్సం సృష్టిస్తున్న సమయంలో అక్కడ కొందరు ఘటనకు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియాని నెటిజెన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకరు ఈ ఎద్దులకు కొట్లాడుకోవడానికి మరెక్కడా స్థలం లేనట్లుగా దుకాణంలోకి దూరాల అంటూ కామెంట్ చేయగా., వామ్మో.. ఇటువంటి యుద్ధం చూస్తుంటే భయమేస్తుంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Kalesh b/w Two Bulls inside Saree Store
pic.twitter.com/w9ZnYkqpgz— Ghar Ke Kalesh (@gharkekalesh) April 30, 2024