NTV Telugu Site icon

Bulli Raju Father: మాకు రాజకీయాలు అంట కట్టొద్దు.. ఆ అకౌంట్లు మావి కాదు!

Bulli Raju

Bulli Raju

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల.. చేసిన మొదటి సినిమాతోనే పవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే రేవంత్ పేరు మీద సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారని రేవంత్ తండ్రి ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మా అబ్బాయి చి. రేవంత్ నటించిన పాత్రను ఇటీవల విడుదల అయ్యి ఘన విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ద్వారా ఆదరించి, ఆశీస్సులు అందచేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

READ MORE: Savarkar: సావర్కర్‌ని గుర్తు చేసిన ప్రధాని మోడీ.. ఫ్రాన్స్‌కి ఏం సంబంధం, బ్రిటీష్ ఓడ నుంచి ఎలా తప్పించుకున్నాడు..

కొన్ని రోజులుగా సోషల్ మీడియా (X) వేదికగా మా అబ్బాయి పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఒక సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు & అప్డేట్స్ సోషల్ మీడియాలో మా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాం. ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్లు కొన్ని చానల్స్ ద్వారా. తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్న విషయమై పోలీస్ వారికీ ఫిర్యాదు చేసాం. దయచేసి మాకు, ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడి పెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియచేస్తున్నాం అంటూ రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.