భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం నేల కూలింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆరు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Also Read:Realme P3 5G: 50MP కెమెరా, 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్
ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రమాద సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనం కూలిన అనంతరం ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరార్ అయినట్లు సమాచారం.
Also Read:Nagavamshi : వారంతా హాస్పిటల్ లో చేరితే బిల్లులు నేనే కడుతా : నాగవంశీ
అయితే రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. పట్టణంలో అనేకమంది సామాజిక కార్యకర్తలు ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఐటిడి పిఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
Also Read:Bhadradri Kothagudem: ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను బేఖాతార్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని టాక్ వినిపిస్తోంది. ఇంటి యజమాని సైతం సామాజిక కార్యకర్తలను అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పట్టణంలోని అనేక బిల్డింగు నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని.. ఫిర్యాదు చేసినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.