NTV Telugu Site icon

Wild Dog Vs Buck: దుప్పి మెడను పట్టుకొని చంపడానికి ప్రయత్నించిన అడవి కుక్క..ఫైట్ మాములుగా లేదుగా

Buck

Buck

Wild Dog Vs Buck Fighting Viral Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు భలే ఆసక్తిగా ఉంటాయి. అవి వేటాడే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆహారం కోసం ఒక జంతువును వేటాడి తినడం అనేది ఆటవిక ధర్మం. ఈ వేటలో జంతువులు తమ కంటే బలహీనమైన వాటి మీద దాడి చేసి వాటిని తమ ఆహారంగా చేసుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఎంత బలమైన జంతువు నుంచి అయినా కొన్ని జంతువులు తెలివిగా చాకచాక్యంగా తప్పించుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. దీనిని లేటెస్ట్ సైటింగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ అడవి కుక్క దుప్పిని వేటాడుతుంది.

Also Read: Laptop Exploded: ల్యాప్ ట్యాప్ ను షట్ డౌన్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే

వీడియోలో మొదట దుప్పి నది దాటి వెళ్లాలి అనుకుంటుంది. అంతలో ఓ అడవి కుక్క దానిని కాలును బలంగా పట్టుకుంటుంది. దానిని నుంచి తప్పించుకొని ఎలాగైనా నీటిలోకి వెళ్లిపోవాలని దుప్పి గట్టిగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నీటిలోకి వెళ్తే తప్పించుకోవడం దుప్పికి ఈజీ అవుతుంది. అయితే మొదట దుప్పి కొంత దూరం నీటిలోకి వెళ్లిన కూడా అడవి కుక్క దానిని బలవంతంగా తీసుకొని వస్తుంది. తరువాత దాని పీకను బలంగా పట్టుకుంటుంది. ఇది చూస్తే మనకి కుక్క చేతిలో జింక బలైపోయింది అనిపిస్తుంది. అయితే దుప్పి ఎంతో చాకచక్యంతో నీటిలోకి మళ్లీ వెళ్లి ఈ సారి లోపలి వరకు వెళుతుంది. నీటిలో చాలా దూరం వరకు వేటాడిన కుక్క మరింత లోతుకు వెళ్లడం వీలుకాక దానిని వదిలేస్తుంది. అయితే కుక్క ఎంతో తెలివిగా దుప్పిని వేరే ఒడ్డు దగ్గర పట్టుకోవాలని దాని కంటే ముందే ఒడ్డుకు వెళ్లి నిలబడుతుంది. అయితే జింక మరో ఒడ్డుకు చేరుకొని దాని ప్రాణాలను కాపాడుకుంటుంది. అప్పుడే టూరిస్టులు అటుగా వెళ్లడంతో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు జింక తప్పించుకుంటుందా లేదా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. జింక తప్పించుకున్నాకా హమ్మయ్యా అనిపిస్తుంది.

 

Show comments