World Record: సాధారణంగా బైక్‌పై కూర్చుని ఏకధాటిగా 50 కిలోమీటర్లు నడపటం కష్టతరంగా ఉంటుంది. కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందిన ఓ స్టంట్ బైకర్ సోమవారం నాడు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌పై ఫ్యూయల్ ట్యాంకర్‌పై నిలబడి 59.1 కిలోమీటర్ల పాటు ప్రయాణించాడు. అతడు 59.1 కి.మీ. దూరాన్ని ఒక గంట 40 నిమిషాల 60 సెకన్‌లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఈ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ ఇండియాకు చెందిన జాంబాజ్ టీమ్ సభ్యుడు సీటీ ప్రసన్నజీత్ నారాయణ్‌దేవ్ అనే స్టంట్ బైకర్ బైక్‌పై నిలబడి 59 గంటల పాటు ప్రయాణించి ఈ రికార్డు సాధించాడు.
Read Also: FIFA World Cup Final: రికార్డ్ క్రియేట్ చేసిన గూగుల్..
కాగా ఇటీవల ఇద్దరు స్టంట్ బైకర్లు కూడా వేర్వేరు ప్రపంచ రికార్డులను సాధించారు. ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైకుపై పడుకుని లాంగెస్ట్ రైడ్ చేశాడు. అతడు 2 గంటల 6 నిమిషాల17 సెకన్‌ల పాటు విరామం లేకుండా దేశ రాజధాని ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని BSF స్టేడియంలో మొత్తం 70.2 కి.మీ. పాటు బైక్‌పై పడుకుని నడిపాడు. అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీపై అమర్చిన 12 అడుగుల 9 అంగుళాల పొడవు గల నిచ్చెనపై ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్పెక్టర్ అవధేష్ కుమార్ సింగ్, కానిస్టేబుల్ సుధాకర్ సుదీర్ఘ రైడ్ చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
