Site icon NTV Telugu

MLC Kavitha: ఓటేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొనసాగుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో ఓటింగ్ తక్కువ ఉంది అనే చెడ్డ పేరును హైదరాబాద్ వాసులకు పిలుపునిచ్చారు. కాబట్టి.. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ప్రజలు అంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలి.. పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి.. కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేస్తుంది.. బీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

అలాగే, ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఓ పోస్ట్ చేసింది.. ఈ పోస్టులో దేశ రక్షణ కోసం బార్డర్ లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు.. కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి.. మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం.. అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి అని ఆమె పిలుపునిచ్చారు.

Exit mobile version