BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..

Braou Admissions

Braou Admissions

డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల ప్రవేశాల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం అడ్మిషన్ల తేదీని పెంచుతూ యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా , ఇతర ఉన్నత చదువుల కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు పీజీ కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ కొత్తగా కొన్ని పీజీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. విద్యారంగం, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, సోషల్ వర్క్ వంటి పలు ఆధునిక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు డిగ్రీ, పీజీ స్థాయిలలో ప్రత్యేకంగా ఆన్‌‌లైన్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, సంబంధిత ధ్రువపత్రాలతో ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్‌ను సంప్రదించి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కోర్సులు, దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో https://www.braouonline.in/ పరిశీలించవచ్చు.