టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘అఖండ 2‘ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ అగ్ర హీరోలు వెనకాడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా మరో అవకాశం ఇచ్చేందుకు ప్రస్తుతానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
దాంతో తన తదుపరి సినిమాను పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసిన బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రానా దగ్గుబాటిలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అది వర్కవుట్ కాకపోవడంతో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు కూడా ఒక భారీ మాస్ కథను వినిపించారు. కానీ అక్కడి నుండి కూడా సరైన రెస్పాన్స్ రాకపోవడంతో బోయపాటి తన చూపును కోలీవుడ్ వైపు మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి అగ్ర హీరో సూర్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే సూర్య డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో కార్తీతో చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అలాగే బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ కార్తీ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సెట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే బోయపాటి సితార ఎంటెర్టైనమెంట్స్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి కార్తీతో సీతారాలో సినిమా చేస్తారా లేదా మరో బ్యానేర్ లో చేస్తారా అనేది చూడాలి.
