టాలీవుడ్‌లో బాలకృష్ణ, బోయపాటి ల కాంబినేషన్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.బాలకృష్ణలో ని మాస్ యాంగిల్, హీరోయిజాన్ని తన సినిమాల్లో భారీ స్థాయి లో చూపిస్తుంటారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబో లో త్వరలో అఖండ 2 రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో బాలకృష్ణతో తనకున్న బాండింగ్ గురించి బోయపాటి శ్రీను ఆసక్తికర కామెంట్స్ చేశారు.బాలకృష్ణ గారి తో మూడు సినిమాలు చేసినా ఒక్కసారి కూడా ఆయనకు కథ చెప్పే అవసరం నాకు రాలేదని అన్నారు బోయపాటి.నేను డైరెక్టర్ అంటే కథ కూడా అడగకుండా బాలకృష్ణ సినిమా ను ఓకే చేస్తారని బోయపాటి శ్రీను తెలిపాడు. ఒకవేళ కథ చెబుతాను అన్నా కూడా వద్దు బ్రదర్ మీరు ఉన్నారు కదా అని బాలకృష్ణ గారు అంటుంటారని బోయపాటి శ్రీను పేర్కొన్నాడు.
బాలకృష్ణ తో తనకున్న బాండింగ్ అలాంటిదని, ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే వస్తున్నానని చెప్పాడు. షూటింగ్ పూర్తయిన తర్వాతే బాలకృష్ణ గారికి సినిమాను చూపిస్తుంటానని బోయపాటి శ్రీను తెలిపారు.. బాలకృష్ణ గారి తో తప్పకుండా అఖండ 2 సినిమా ను చేస్తాను అని ఆయన తెలిపారు.బాలకృష్ణ, బాబీ సినిమా పూర్తయిన తర్వాతే అఖండ 2 సెట్స్ ఫైకి వస్తుందని బోయపాటి శ్రీను తెలిపారు.బాలకృష్ణను ఉద్దేశించి బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోన్నాయి. స్కంద సినిమా తర్వాత తాను మరో స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నట్లు బోయపాటి శ్రీను తెలిపారు.ఆ సినిమా కూడా సరికొత్త కథాంశం తో భారీ యాక్షన్ సీన్స్ తో ఉండబోతున్నట్లు ఆయన తెలియజేశారు.ఆ హీరో ఎవరూ అనేది మాత్రం త్వరలోనే తెలియజేస్తాను అని ఆయన తెలిపారు.
