Boltt Ace 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి బోల్ట్ (Boltt) సంస్థ మొదటిసారిగా అడుగుపెట్టేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. భారత మార్కెట్లో బోల్ట్ ఏస్ 5G (Boltt Ace 5G), బోల్ట్ ఈవో (Boltt Evo) పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ రెండు ఫోన్లను ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. లాంచ్‌కు ముందే కెమెరా, గూగుల్ AI ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలను ప్రకటించింది.
64MP కెమెరా:
బోల్ట్ ఏస్ 5Gను ఈ సిరీస్‌లో ప్రీమియం మోడల్‌గా తీసుకురానుంది. ఇందులో 64MP AI రియర్ కెమెరా ఉంటుంది. ఇది f/1.8 అపెర్చర్‌తో పనిచేస్తుంది. మరోవైపు బోల్ట్ ఈవోలో 50MP AI ప్రైమరీ కెమెరా అందించనున్నారు. రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 8MP ఫ్రంట్ AI కెమెరా ఉంటుంది. ఇందులో రియల్ టోన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సహజమైన స్కిన్ టోన్లు, మరింత వివరాలతో కూడిన ఫోటోలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. వీటిలో ఫోటోగ్రఫీని సులభతరం చేసేందుకు పలు AI ఆధారిత ఫీచర్లను అందిస్తున్నారు. పేస్ అన్ బ్లర్ ఫీచర్ సెల్ఫీల్లో బ్లర్‌ను తగ్గించి ముఖాన్ని మరింత క్లియర్‌గా చూపించేందుకు ఉపయోగపడుతుంది.
అలాగే AI నైట్ మోడ్ తక్కువ వెలుతురులో ప్రకాశవంతమైన, షార్ప్ ఫోటోలను తీసేందుకు సహాయపడుతుంది. సీన్ ఆప్టిమైజషన్ ఫీచర్ ఫోటో తీస్తున్న సందర్భాన్ని గుర్తించి ఇమేజ్ ప్రాసెసింగ్‌ను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. దీంతో వినియోగదారులు ప్రతిసారి కెమెరా సెట్టింగులను మాన్యువల్‌గా మార్చాల్సిన అవసరం ఉండదు. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం AI పోర్ట్రైట్స్, హార్డ్‌వేర్-లెవల్ AI బొకే, డెప్త్ మ్యాపింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. సెల్ఫీల కోసం AI ఆధారిత ఎన్‌హాన్స్‌మెంట్ టూల్స్‌ను అందించనున్నారు.
Google AI ఫీచర్స్:
కెమెరా ఫీచర్లతో పాటు బోల్ట్ తన కొత్త ఫోన్లలో గూగుల్ AI సామర్థ్యాలను కూడా అందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ జెమినీ ద్వారా స్క్రీన్‌పై కనిపించే కంటెంట్‌ను అర్థం చేసుకోవడం, రోజువారీ పనులను సులభతరం చేసుకోవడం వంటి AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా సర్కిల్ టు సెర్చ్, గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు కూడా రెండు ఫోన్లలో ఉంటాయి. స్క్రీన్‌పై కనిపించే వస్తువును గుర్తించడం, టెక్స్ట్‌ను అనువదించడం, ప్రొడక్ట్స్ గురించి సెర్చ్ చేయడం లేదా ఏదైనా వస్తువు గురించి సమాచారం తెలుసుకోవడం వంటివి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే చేసుకోవచ్చు.
డిజైన్:
బోల్ట్ ఏస్ 5G వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరాలు, LED ఫ్లాష్ ఉంటాయి. ఈ ఫోన్ రెడ్ కలర్‌లో అందుబాటులోకి రానుంది. దీని మందం 9.49 మిల్లీమీటర్లుగా ఉంటుంది. బోల్ట్ ఈవో లో స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలతో పాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఇది లైట్ బ్లూ కలర్‌లో రానుంది. రెండు ఫోన్లలోనూ ఫ్లాట్ డిస్‌ప్లే, సెంటర్-మౌంటెడ్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ఉంటాయి. పవర్, వాల్యూమ్ బటన్లు కుడివైపు అందించనున్నారు.
ఈ రేండు స్మార్ట్ ఫోన్స్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. లాంచ్ అనంతరం రెండు ఫోన్ల అమ్మకాలు మొదలు కానున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు ధరలను వెల్లడించలేదు. లాంచ్ సమయంలో ధర, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించనుంది.

