NTV Telugu Site icon

Urvashi Rautela Video: ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ వీడియో లీక్!

Urvashi Rautela Video

Urvashi Rautela Video

Urvashi Rautela Video Goes Viral: బాలీవుడ్‌ హాట్ భామ ‘ఊర్వశీ రౌతేలా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో ప్రేమాయణం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆ మధ్య తన ఐఫోన్ పోయిందంటూ రచ్చ చేసిన ఊర్వశీ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఊర్వశీ ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఊర్వశీ రౌతేలా బాత్రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఊర్వశీ దుస్తులు మార్చుకుంటన్న వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టింస్తోంది. ఈ వీడియోపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం చేసిన వీడియో ఇది అని కొందరు అంటున్నారు. ఏదైనా సినిమాల్లోని సీన్ కావొచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రైవేట్ వీడియోతో ఊర్వశీ రౌతేలా మరోసారి చర్చనీయాంశం అయింది.

Also Read: ICC Chairman: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్!

2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో ఊర్వశీ రౌతేలా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆపై హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌ పంతి లాంటి ఎన్నో చిత్రాలలో నటించారు. ఊర్వశీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌, బ్రో, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. ప్రస్తుతం ‘ఎన్‌బీకే 109’లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఊర్వశీ తెలుగులో మరో సినిమాకు సంతకం చేశారని తెలుస్తోంది.