Site icon NTV Telugu

Organ Donation: కెనడాలో మృతి చెందిన యువకుడి మృతదేహం సూరత్లోని వైద్య విద్యార్థులకు విరాళం..

Organ Donation

Organ Donation

కెనడాలో నివసిస్తున్న 39 ఏళ్ల ప్రజేష్ పటేల్ ఏప్రిల్ 21న కన్నుమూశారు. మానవతా విలువలున్న ఆయన పట్ల నిబద్ధతతో ఆలోచించిన ఆయన కుటుంబం, భారతదేశంలో వైద్య విద్య కోసం ఆయన శరీరాన్ని విరాళంగా ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ నిస్వార్థ చర్య దేశ చరిత్రలో విదేశాలలో నివసిస్తున్న ఒక భారతీయ పౌరుడు అటువంటి ప్రయోజనం కోసం తమ శరీరాన్ని దానం చేయడం ఇదే మొదటిసారి. ప్రజేష్ మృతదేహాన్ని దానం చేయాలని నిర్ణయం అతని తండ్రి, డానేట్ లైఫ్ సంస్థ ట్రస్టీ అయిన ప్రకాష్ భాయ్ పటేల్ తీసుకున్నారు. ప్రజేష్ స్వయంగా అవయవ దానం అవగాహనను ప్రోత్సహించడంలో చురుకుగా పాల్గొన్నాడు. అతిసారం, వాంతులకు సంబంధించిన సమస్యల కారణంగా ఆయన కెనడాలోని ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే అకాల మరణం సంభవించింది.

Also Read: MI vs LSG: లక్నో ముందు స్వల్ప లక్ష్యం.. ముంబై ఎంత స్కోరు చేసిందంటే..?

ప్రజేష్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఆనంద్ ఎంపీ మితేష్భాయ్ పటేల్ సహాయం చేసారు. అతని మృతదేహాన్ని టొరంటో నుండి ఢిల్లీకి పంపించి, ఆపై అంబులెన్స్ ద్వారా ఓడ్ గ్రామానికి రవాణా చేశారు. అతని డెడ్ బాడీ వచ్చిన తరువాత నిశ్శబధమైన భావోద్వేగ వాతావరణం ఏర్పడింది.

Also Read: IPL 2024: బీసీసీఐకి షాకిచ్చిన ఈసీబీ.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ ల‌కు దూరంకానున్న ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు..

ప్రజేష్ కుటుంబంలో ఉపాధ్యాయురాలైన అతని భార్య సెజల్., వారి ఇద్దరు పిల్లలు విహాన్, మిహికా కెనడాలో నివసిస్తున్నారు. తన ఇద్దరు వివాహిత అక్కచెల్లతో పాటు అతని తల్లిదండ్రులు ప్రకాష్ భాయ్, ఆర్తిబెన్ ముంబైలో నివసిస్తున్నారు.

Exit mobile version