NTV Telugu Site icon

Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Raye

Raye

రష్యా నదిలో మునిగి చనిపోయిన నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నలుగురు విద్యార్థుల మృతదేహాలను వారి సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు తీసుకువస్తున్నట్లు జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు.

రష్యాలోని వోల్ఖోవ్ నదిలో మునిగిన నలుగురు భారతీయుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని మహారాష్ట్రకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. మృతదేహాలను భారతదేశానికి తరలిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 4న వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మొదటి రెండు రోజుల్లోనే రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం ఉదయం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నట్లు రష్యా అధికారులు తెలిపారని జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మృతదేహాలు ముంబైకి వస్తున్నాయని.. అనంతరం జల్గావ్ జిల్లాలోని విద్యార్థుల స్వస్థలాలకు తీసుకువెళతారని ప్రసాద్ తెలిపారు.

మృతులు హర్షల్ అనంతరావ్ దేసాలే, జిషాన్ అస్పర్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులాంగౌస్ మహ్మద్ యాకూబ్‌లుగా గుర్తించారు. వీరంతా యారోస్లావ్-ది-వైజ్ నోవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఐదుగురు విద్యార్థుల బృందంలో ఉన్నారు. అందరూ 18 మరియు 20 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఇక జిషాన్ మరియు జియా తోబుట్టువులు. నిషా భూపేష్ సోనావానే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం వైద్య సిబ్బంది సంరక్షణలో ఉన్నాడు. మంగళవారం వోల్హోవ్ నది వెంట నడిచి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇదిలా ఉంటే జిషాన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో ఉండగానే ఈ ఘటన జరగడం విశేషం. బలమైన అలలు కారణంగా కొట్టుకుపోయారని కుటుంబ సభ్యుడు స్థానిక మీడియాకు తెలిపారు. మరోవైపు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రష్యాలోని భారత రాయబారికి పంపిన సందేశంలో సంతాపం తెలిపింది.