NTV Telugu Site icon

Blue Dosa : నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న బ్లూ దోస వీడియో.. అద్భుతమే..

Blue Dosa

Blue Dosa

దోసలో రకరకాల దోసలను మనం చూస్తూనే ఉంటాం.. కానీ బ్లూ దోసను ఎప్పుడైన తిన్నారా? కనీసం చూశారా? బహుశా విని ఉండరు.. ఇప్పటివరకు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్‌ కార్న్‌ దోస అబ్బో ఈ లిస్ట్‌ పెద్దదే.. సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్‌ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్‌ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్‌ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది.. ఇప్పుడు దోస వీడియో..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు.. చూడటానికి చాలా బాగుంది.. బ్యూటిఫుల్‌ కలర్‌ అని కొంతమంది కమెంట్‌ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్‌.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక కొంతమంది ఏం పిచ్చిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.. ఏది ఏమైనా ఈ అందమైన దోస వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..

Show comments