అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి రోజు ఒక చిన్నారి పకృతిపై ప్రేమతో చెట్లకు రాఖీలు కట్టి ఆశ్చర్యానికి గురి చేసింది. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కూతురు బ్లేస్సి నాంపల్లి నిర్మల స్కూల్లో నాలుగవ తరగతి చదువుతోంది. తన తండ్రి ప్రకృతి ప్రకాష్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో తన కూతురు బ్లేస్సి సైతం అదే బాటలో అడుగులు వేస్తుంది.
Read Also: Andhrapradesh: వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్.. రూ. 500 డీఏ మంజూరు చేసిన సీఎం జగన్
చిన్ననాటి నుంచి పర్యవరణ పరిరక్షణకై తాను సైతం బ్లేస్సి ముందుకు సాగుతుంది. గతంలో చెట్ల కింద రాలిపడ్డ విత్తనాలను సేకరించి మట్టితో విత్తన బంతులుగా చేసి తన తండ్రికి సహాయ పడింది. బ్లేస్సి కృషిని గుర్తించిన రాజ్యసభ సభ్యులు జోగినపెళ్లి సంతోష్ కుమార్, మంత్రి కేటీఆర్ లు బ్లేస్సి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ కు పిలిపించుకొని మొక్క నాటించి, శాలువతో సత్కరించి, మెమొంటోతో అభినందించిన విషయం తెలిసిందే. అయితే రాఖీ పండుగ సందర్భంగా బ్లేస్సి రాత్రంతా 105 రాఖీలను కలర్ పేపర్లతో అందంగా తయారు చేసి, తన ఇంటి ఆవరణంలో ఉన్న చెట్లతో పాటు హరితహారంలో రోడ్డు కిరువైపులా నాటిన చెట్లకు ప్రేమతో రాఖీలు కట్టి నీళ్లు పోసింది.
Read Also: Kushi: అంతా బానే ఉంది.. ఆ ఒక్కటీ సెట్ అయితే ఇక ఆపేవారే లేరు..
రాఖీలు సోదరులకే పరిమితం కాదని మనం పుట్టినప్పటి నుంచి చెట్లు ప్రాణవాయువు ఇస్తూ గిట్టే వరకు కాపాడుతూనే ఉన్నాయని, చెట్లే మనకు నూరేళ్ల రక్షా అని, రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు చెట్లకు రాఖీలు కట్టాలని బ్లెస్సీ కోరింది. ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సదరు బాలిక కోరింది.