Site icon NTV Telugu

MLA Venkataramana Reddy: హైడ్రా కూల్చివేతల పాపం అధికారులదే..

Bjp Mla Venkataramana Reddy

Bjp Mla Venkataramana Reddy

BJP MLA Venkataramana Reddy: హైడ్రా ధనవంతుల కట్టడాలను కూల్చడం లేదని.. కేవలం సామాన్యుల ఇళ్లను కూలుస్తోందని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చడం తప్ప ఇప్పటివరకు చేయగలిగింది ఏం లేదన్నారు… అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను కూడా కూలుస్తున్నారని గుర్తు చేశారు. చెరువులు, కుంటలను మొత్తం కబ్జాలు చేస్తున్నారన్నారు.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వారికి కజ్జా భూములకు సైతం అనుమతిలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా ఆక్రమణలు, నిర్మాణాలపై హెచ్ఎండీఏ, రేరాకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే అంశంపై అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్రస్తావించానన్నారు. హైడ్రా కూల్చివేతల పాపం అధికారులదే.. ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదని ప్రభుత్వ అధికారులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. హైడ్రా తీరు, కబ్జాలతో నేను వేసిన రిట్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ హైడ్రా, రెరా, HMDA, GHMC లకు నోటీసులు జారీ చేయమని చెప్పారు. విచారణను హైకోర్టు 30 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.

Exit mobile version