ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు బీజేపీ నేత, జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట జగనాసుర రక్తచరిత్ర అని టీడీపీ పుస్తకం విడుదల చేసింది. టీడీపీని సమర్థించక పోయినా అందులో నిజం ఉంది. రెండు పార్టీలు టైటిల్ పెట్టి బుక్కులు వేశారు. వివేకానందరెడ్డి కేసులో అసలైన సూత్రధారులు ఎవరు అన్నది తేలాలి. ఇప్పటికే పాత్రదారులు లోపల ఉన్నారు. ఏ ప్యాలెస్ నుంచి ఏ టైంలో ఎంతసేపు మాట్లాడారు అన్నది విచారణలో బయటికి వస్తుంది.
Read Also: NBK: అఖండ కాంబినేషన్ రిపీట్ అయ్యింది… టెలికాస్ట్ ఎప్పుడో?
లిక్కర్ స్కాం లో ఎవరు ఉన్నా చట్టం ప్రకారం శిక్ష తప్పడం లేదు. రెండు పార్టీ ల విమర్శలతో ఏపీలో అభివృద్ధిపై చర్చ చేయలేదు. మార్చి 13 న ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. జగన్ నాలుగేళ్ళలో ఏమి చేయక పోగా అన్ని వర్గాలను మోసం చేశారు.ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. గతం లో చేసిన టక్కుటమార విద్యల తో గెలవాలని చూస్తున్నారు. రాష్ట్రానికి ఫ్యాక్టరీ లు తెమ్మంటే దొంగ ఓట్లు ఫ్యాక్టరీ తెచ్చారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారు. వాటి పై ఎన్నికల కమిషన్ కి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. రేపు జరిగే ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి ముందస్తుకు వెళ్ళాలి అని చూస్తున్నారని విమర్శించారు సత్య కుమార్.
Read Also: Banda Prakash : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఎన్నిక