Site icon NTV Telugu

Ashok Chavan: అశోక్ చవాన్‌కు బెదిరింపు.. భద్రత పెంపు

Ashok

Ashok

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అశోక్‌ చవాన్‌కు (Ashok Chavan) రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు ముప్పు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న నివేదిక ప్రకారం అశోక్‌ చవాన్‌కు వై-ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత కల్పించారు.

ఇటీవలే అశోక్‌చవాన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ‌లో చేరారు. అలా చేరారో లేదో వెంటనే ఆయనను రాజసభ్యకు బీజేపీ నామినేట్ చేసింది. ఏకగ్రీవంగా ఆయన రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఇదిలా ఉంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న కారణంగా వై-ప్లస్ కేటగిరిలోకి చేర్చడంతో ముంబై నివాసం దగ్గర.. ఆయన స్వగ్రామమైన నాందేడ్‌లో భద్రతను మరింత పెంచారు.

ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు (పీఎస్ఓలు) అనుక్షణం ఆయన వెంటే ఉంటారు. ‘వై’ కేటగిరీ కింద సహజంగా ఇద్దరు కమెండోలు, సివిల్ పోలీసు అధికారులతో సహా 8 నుంచి 11 మంది భద్రతా సిబ్బందిని కేటాయిస్తుంటారు. స్టేట్ పోలీస్ వీఐపీ సెక్యూరిటీ శాఖ చవాన్ భద్రతను పెంచినట్టు అధికారులు చెప్పారు.

Exit mobile version