Site icon NTV Telugu

Bihar: “గో మాంసం తినిపించారు.. కల్మా, నమాజ్ చదివించారు”.. బలవంతంగా మతం మారిన మహిళ కథ..

Bihar

Bihar

Bihar: బీహార్‌లోని అరారియా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తనను కారులో కిడ్నాప్ చేసి ఢిల్లీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బందీగా ఉంచారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. నర్పత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా ఎనిమిది మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి.. శారీరకంగా, మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది.

READ MORE: Red Fruits, Vegetables: ఎరుపు రంగు పండ్లలో ఇన్ని రకాల పోషకాలున్నాయని మీకు తెలుసా..

బాధితురాలి ప్రకారం.. మొదటి పలాసి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం సహా పలువురు బాధితురాలిని ట్రాప్ చేశారు. కారులో అపహరించి మొదట భీమ్‌పూర్, వీర్‌పూర్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత సహర్సాలో, ఢిల్లీలో బందీగా ఉంచారు. ఈ సమయంలో ఆమెను హింసించి ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేశారు. బలవంతంగా లైంగిక సంబంధంలోకి నెట్టి, ఆవు మాంసం తినిపించారు. అంతేకాకుండా.. కల్మా, నమాజ్ పఠించమని ఒత్తిడి తెచ్చారు. బాధితురాలు ఓ వివాహిత. ఆమె పిల్లలను సైతం చంపుతామని ఆమెను బెదిరించారు. నగలు కూడా దొంగిలించారు. ఆ మహిళ ఏదో విధంగా నిందితుల బారి నుంచి తప్పించుకుని తన భర్తతో కలిసి అరారియాకు చేరుకుని నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టుకు హాజరైన ఆమె జరిగిన మొత్తం సంఘటనను న్యాయమూర్తికి వివరించింది. తనను నెలల తరబడి హింసించారని పేర్కొంది. తాను పారిపోవడానికి అవకాశం దొరకడంతో అక్కడి నుంచి తప్పించుకుని భర్త వద్దు వచ్చినట్లు కోర్టులో చెప్పింది. ఈ ఘటనపై పోలీసుల వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: India GDP Q2 2025: ఆర్బీఐ అంచనాలకు మంచి.. దేశ జీడీపీ పెరుగదలకు మూడు ప్రధాన కారణాలు ఇవే..

Exit mobile version