Site icon NTV Telugu

Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు

Harsha Sai

Harsha Sai

Bigg Boss Fame Girl Files Complaint on Harsha Sai: ప్రముఖ యూట్యూటర్ హర్ష సాయి పై పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయి, ఆయన తండ్రి రాధాకృష్ణ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ లో కొంత పేరు తెచ్చుకుంది. మరో ఆసక్తిక్రమైన విషయం ఏమిటంటే హర్షసాయి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. అది కూడా ఏకంగా పాన్‌ ఇండియా సినిమాతో, తాను నటించడమే కాదు, ఈ సినిమాకు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తున్నాడు.

DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..

ఈ చిత్రానికి మెగా అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయగా గత ఏడాది ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు చేయగా ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. నిజానికి హర్షసాయికి చాలామంది అభిమానులు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నోట్ల కట్టలు పంచడం, నిరుపేద జీవితాల తలరాతను రాత్రికి రాత్రే మార్చేయడం, పొట్టకూటి కోసం బతుకు బండి లాగిస్తున్న వారికి లక్షల డబ్బు ఇచ్చి వారి ముఖాల్లో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి దాన కర్ణుడు అని పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద ఇలాంటి ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది.

 

Exit mobile version