NTV Telugu Site icon

Amardeep : బిగ్ బాస్ ఫేం అమర్ దీప్ హీరోగా ‘నా నిరీక్షణ’ ప్రారంభం

New Project 2024 10 13t113550.793

New Project 2024 10 13t113550.793

Amardeep : సీరియల్స్ తో బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. బిగ్ బాస్ షోతో అమర్ దీప్‌కు మంచి క్రేజ్ వచ్చింది. విన్నర్‌గా నిలవాల్సిన అమర్ దీప్.. చివరకు రన్నర్ గా బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి రాక ముందే ఓ స్క్రిప్ట్‌ను ఓకే చేసేశాడు. ఆ సినిమాను సురేఖ వాణి కూతురు సుప్రీతతో కలిసి అమర్ దీప్ తన మొదటి చిత్రంగా ప్రారంభించేశాడు. సుప్రీత, అమర్ దీప్ చిత్రాల ఆల్రెడీ ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతుంది. ఇక ఇప్పుడు అమర్ దీప్ రెండో చిత్రాన్ని ప్రారంభించేశాడు. వరుస ప్రాజెక్టులతో అమర్ దీప్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

తాజాగా అమర్ దీప్ హీరోగా లిషి గణేష్ కల్లపు హీరోయిన్‌గా పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద పి. సంతోష్ రెడ్డి నిర్మాణంలో నా నిరీక్షణ అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సాయి వర్మ దాట్ల దర్శకత్వం వహించనున్నాడు. దసరా సందర్భంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు సురేష్ బాబు ఆశీస్సులతో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా.. రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ..నా నిరీక్షణ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Read Also:CM Revanth Reddy: రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్లో సందడి వాతావరణం.. ముఖ్యులతో మాటామంతీ..

డైరెక్టర్ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ.. ‘దసరా పండుగ అయినా మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు, దిల్ రాజు, రాజా రవీంద్రకి థాంక్స్. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నాను’ అని అన్నారు. అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే ఏడు నెలలు పని చేశారు. వారి వల్లే ఈ మూవీ ఇక్కడికి వరకు వచ్చింది.నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ లిషి గణేష్ కల్లపు మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో చిత్రం. ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ చిత్రానికి తిరుమలేష్ బండారు మాటలు అందిస్తుండగా.. వి.రవి కుమార్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో ఈ మూవీ రానుంది.

Read Also:Cockroach : అణు యుద్ధాన్ని కూడా గెలిచేస్తుంది కానీ ఆడదాని దెబ్బకు చచ్చిపోతుంది

Show comments