NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప 2 అల్లు అర్జున్ కట్టిన చీర వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా?

Pushpa222

Pushpa222

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు.. దాంతో సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..

రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు..టీజర్ ఊహించని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.. అటు అభిమానులకు కూడా చాలాకాలం తర్వాత బన్నీ మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు.. బన్నీ చీరలో విశ్వరూపం చూపించారు.. మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. పుష్ప 2 సినిమాకు గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని టీజర్ ను చూస్తే తెలుస్తుంది..

ఇప్పుడు ఆ చీర గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ చీర నిజానికి వాళ్ల అమ్మదట.. సెంటిమెంట్ గా ఉంటుంది అని డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ చాలా హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా..రావు రమేష్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, అనసూయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు..